మధ్యప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం) లు రేపిన కలకలం అంతా ఇంతా కాదు. త్వరలో అక్కడ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల జరగనున్న వేళ, వివిధ పార్టీ ఏజంట్ల ముందు ఈవీఎంలను ప్రదర్శించటం, అది కాస్త ఎవరికి నొక్కినా బీజేపీకే పడుతున్నట్టు చూపించటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్యరావ్ సింధియా, ఆప్ అధినేత కేజ్రీవాల్ లు హుటాహుటినా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అధికారం అండతో బీజేపీ ఈవీఎంలను టాంపరింగ్ చేస్తున్నారంటూ అధికార పక్షంపై ఫిర్యాదులు కూడా చేశారు.
దీంతో తప్పు ఎక్కడ జరిగిందన్న విషయాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి భన్వర్ లాల్ నియమించగా, ఆయనే స్వయంగా అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ట్యాంపర్ అయినట్టు చెప్పబడుతున్న ఈవీఎం ఎందుకలా ప్రవర్తించిందన్న విషయాన్ని తమ సాంకేతిక నిపుణులు గుర్తించారని తెలిపారు. ఇక్కడ చూపిన ఈవీఎం ఇటీవలి ఉత్తరప్రదేశ్, కాన్పూర్ పరిధిలోని గోవిందనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో వాడారు. సాధారణంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి విజేతను ప్రకటించాక, అందులోని వీవీపీఏటీ (వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్)లో డేటాను చెరిపేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ అలా జరగలేదు.
అదే మెషిన్ ను డెమో కోసం వాడారు. అందుకే ఏది నొక్కినా బీజేపీ అభ్యర్థికే పడినట్లు చూపించిందని భన్వర్ లాల్ వివరించాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదని, కేవలం అదికారుల నిర్లక్ష్యమే ఇక్కడ కారణమని తెలిపాడు. ఇక ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు 150 ఈవీఎంల డిమాన్ స్ట్రేషన్ కు ఏర్పాట్లు చేశామని భన్వర్ లాల్ స్పష్టం చేశాడు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ముగ్గురిని బదిలీ చేశామని, మరో 19 మందిపై విచారణ ప్రారంభమైందని వివరించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more