ఇక తొందరలో బీర్ ధరలను అకాశానంటుతాయి. ఇప్పటికే కాస్ట్లీ మద్యంగా వున్న రెడ్ వైన్ కూడా మరింత ధర పెరిగే అవకాశం వుంది. అదేంటి వేసవి కాబట్టి బీర్ ధర పెరగడంలో తప్పులేదు కానీ వైన్ ధర ఎందుకు పెరగనుంది అని అంటున్నారు కదూ. కానీ ఇది నిజం ఇప్పటికే రెడ్ వైన్ తో దుస్తులను తయారు చేయగల సామర్థాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు 2007లో అ దిశగా అడుగులు వేశారు. కాగా తాజాగా బీర్ తో కూడా దుస్తులను తయారు చేయగలమని రుజువు చేశారు. దీంతో ఇక వస్త్ర తయారీ రంగంలో వీటి వినియోగాలు అధికం కానున్న నేపథ్యంలో ధరలు పెరుతాయని మధ్య ప్రియులు అందోళన చెందుతున్నారు.
మనం నిత్యం ధరించే వస్త్రాలు ఎలా తయారవుతాయంటే.. రమారమి అందరికీ తెలిసిందే. పత్తి లేదా నార నుంచి తీసిన దారాలతో దుస్తులు తయారు చేస్తారు. కానీ యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా బయోలజీ ల్యాబ్ కు చెందిన శాస్త్రవేత్తలు వైన్, బీరులను కేవలం తాగడానికి మాత్రమే కాదు దుస్తులు తయారు చేసేందుకు కూడా వినియోగించవచ్చని నిరూపించారు. వైన్, బీరుతో దుస్తులు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైన్ తో 2007లోనే దుస్తులు తయారు చేసిన శాస్త్రవేత్తలు.. తాజాగా బీర్ తో కూడా దుస్తులను తయారుచేయగలమని నిరూపించారు.
బీరును బాగా పులియబెట్టి వస్త్రంగా మార్చారు. ‘యాక్సెటోబేటర్’ అని పిలిచే బాక్టీరియా కల్చర్ తో అసాధారణ, విప్లవాత్మకమైన వస్త్రాన్ని సృష్టించారు. ఈ విధానంలో బాగా పులిసిన రెడ్ వైన్ ను బాక్టీరియా సూక్ష్మ నూలిపోగులతో కూడిన పదార్థంగా మార్చేస్తుందని వారు చెప్పారు. వీటితో దుస్తులను తయారు చేస్తామని చెప్పారు. అయితే వైన్ తో తయారు చేసిన దుస్తుల కన్నా బీర్ తో తయారు చేసిన దుస్తులు కొంత బలంగా వున్నాయని తెలిపారు. వైన్ తో తయారు చేసిన దుస్తులు మరీ బలహీనంగా వున్నాయన్న విషయం శాస్త్రవేత్తలు ఇదివరకే స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more