ఎవరీ ప్రీతికా యాషినీ..? ట్రెడింగ్ కు కారణమేమీ..? Meet K Prithika Yashini, India's first transgender SI

Meet k prithika yashini india s first transgender si

K Prithika Yashini, Sub-inspector, Dharmapuri, Tamil Nadu, transgender, TN Police Academy, Bandi Gangadhar, Edappadi K Palanisami, trending, social media

K Prithika Yashini, 26, goes trending on social media, since few days as she scripted history when she took charge as sub-inspector in Dharmapuri district in Tamil Nadu.

ఎవరీ ప్రీతికా యాషినీ..? ట్రెడింగ్ కు కారణమేమీ..?

Posted: 04/07/2017 05:09 PM IST
Meet k prithika yashini india s first transgender si

కె. ప్రీతికా యాషినీ.. ఎవరీమె.. ఏమిటీ ఈమెలోని విశేషము.. ఎందుకని ఈమె సోషల్ మీడియాలో ట్రెడింగ్ అవుతున్నారు. అసలు ఈమె సాధించిన ఘటన ఏమిటీ అన్న ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులను, నెట్ జనులలో ఉత్పన్నమవుతున్నాయి. ఈమె అందరిలాంటి మనిషి కాదు. ఈమె ఒక ట్రాస్స్ జెండర్. అయితే ఈమెకు చిన్ననాటి నుంచి పోలీస్ కావాలన్నది అశయం. ఆ ఆశయాన్ని సాధించేందుకు అమె చేసిన కృషి, పడిన పాట్లు అన్ని ఇక తీరిపోయాయి. ఎందుకంటారా.. అమె పోలీస్ అయ్యింది. ఎస్ఐగా బాధ్యతలను అందుకుంది.

సంకల్పం, పట్టుదల, తపన, కృషి ఇవన్నీ మెండుగా వుంటే.. కొండనైనా పిండి చేయవచ్చునన్నట్లు.. ట్రాన్స్ జెండర్ గా వున్న ఈమె తన కలను సాకారం చేసుకునేందుకు పడిన కష్టమే అమెను నెట్ జనులు అదరణ పోందేలా చేసింది. అమెను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల కె. ప్రీతికా యాషినీ దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ ఎస్‌ఐగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2015 ఫిబ్రవరిలో వెలువడిన ఎస్‌ఐ నోటిఫికేషన్ చూసి ఎస్‌ఐ పోస్టుకు అప్లై చేసింది. అయితే ప్రీతికా ట్రాన్స్ జెండర్ కావడంతో ఆమె దరఖాస్తును ఆ రాష్ట్ర పోలీసు శాఖ తిరస్కరించింది.

దీంతో 2015 నవంబర్‌లో మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన ప్రీతికా..ఎస్‌ఐ పోస్టుకు ఆమె అర్హురాలు అని తీర్పు వెలువరించింది. కష్టపడి చదివి ఎస్‌ఐ పరీక్షలు రాసిన ప్రీతికా అర్హత సాధించి ఎస్‌ఐ ఉద్యోగాన్ని సంపాదించింది. ధర్మపురిలో టౌన్‌లో ఆమెకు పోస్టింగ్‌ ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు పోస్టింగ్‌ ఆర్డర్స్‌ అందుకున్న యాషినీ.. అనేకమంది హిజ్రాలకు ఆదర్శంగా నిలిచారు. దీంతో అమెతో పాటు పరీక్షలు రాసీ ఉత్తీర్ణులైన 21 మంది ట్రాన్స్ జెండర్లకు ఎస్‌ఐ పోస్టింగ్ ఇస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles