కోతులతో సావాసం.. మనుషులంటే భయం.. వినడానికి మీకు విచిత్రంగా వున్నా ఇది అక్షరాల నిజం.. జంగిల్బుక్లో మోగ్లీ కల్పిత కథ అయితే.. ఈ బాలికది మాత్రం నిజమైన గాధ. చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అడవిలో జంతువులతో కలిసి పెద్దవాడైన మోగ్లీకి జంతువుల అలవాట్లే వచ్చినట్లు.. ఈ అమ్మాయికి కూడా అచ్చంగా వానరపు లక్షణాలే వచ్చాయి. వానరాలే తల్లిదండ్రై ఈ బాలికను పెంచాయి. ఉత్తరప్రదేశ్ అటవీశాఖ పోలీసులు ఈ బాలికను కనుగొని.. స్థానిక అసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఈ బాలిక కోతి మూకకు ఏ వయసులో దొరికిందో, ఎక్కడ దొరికిందో తెలియదు. బాలికను ఎక్కడి నుంచి తీసుకు వెళ్లాయో, ఏమో కానీ … ఆ కోతులు పాపను కంటికి రెప్పలా సాకాయి. గుంపులు గుంపులుగా ఉన్న కోతుల మధ్య ఆ బాలిక ఇన్నాళ్లుగా ఎలా ప్రమాదం బారిన పడకుండా ఉండగలిగిందో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ బాలిక కనీసం మనుషుల్లాగా మాట్లాడటంగానీ, ప్రవర్తించడంగానీ చేయడం లేదు. పైగా మనుషులను చూసి తెగ భయపడుతోంది. ఇప్పుడా పాప నాగరిక సమాజంలో చిక్కుకుని, దిక్కుతోచని స్థితిలో ఉంది.
వివరాల్లోకి వెళితే.. బహ్రెయిక్ అటవీ ప్రాంతంలో నిత్యం మాదిరిగానే తన పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్ అటవీశాఖ ఎస్ఐ సురేష్ యాదవ్ కుమోతిపూర్ ప్రాంతంలో కటార్నియాఘాట్ వైల్డ్ లైఫ్సాంక్చూరీలో, కోతుల మధ్య ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలిక కనిపించింది. బాలికను తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కోతులు అతనిపై దాడికి యత్నించాయి. అవే కాదు బాలిక కూడా వాటిలాగానే తిరగబడేందుకు ప్రయత్నించింది. దీంతో సురేష్ యాదవ్ తన సిబ్బందికి, ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు.
అటవీశాఖ సిబ్బంది కొందరు ఘటనాస్థలానికి చేరుకుని కోతుల నుంచి బాలికను వేరుచేసేందుకు ప్రయత్నించి అతికష్టం మీద సక్సెస్ అయ్యారు. వెంటనే బాలికను స్థానిక జిల్లా అస్పత్రికి తరలించారు. కాగా, అస్పత్రిలోనూ ఆ బాలిక అచ్చంగా కోతుల్లాగే అరుస్తూ.. మనుషులను చూడగానే అప్పుడప్పుడూ ప్రమాదకారిగా మారుతుంది. కాగా, వైద్యానికి స్పందిస్తోందని వైద్యులు చెబుతున్నారు. మెల్లగా మార్పు వస్తుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాళ్ల సాయంతో నడవడం నేర్పిస్తున్నామని, అయితే అన్నం మాత్రం చేతులతో కాకుండా నేరుగా తింటుందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more