వామ్మో.. సూపర్ మార్కెట్ ఫ్రిడ్జ్‌లో 12 అడుగుల పైతాన్ | Shopper pulls 12ft python from supermarket fridge.

Massive snake found in supermarket fridge

Snake in Fridge, Super Market Fridge, Python Fridge, Fridge Python, South Africa Super Market Fridge, South Africa Super Market Python, Snake in Super Market, Python in Super Market, Supermarket Fridge

Shopper reaches for curd in the supermarket fridge in South Africa, finds a 12-feet long python chilling in there.

పాల కోసం ఫ్రిడ్జ్ లో చెయ్యి పెడితే...

Posted: 04/11/2017 05:24 PM IST
Massive snake found in supermarket fridge

ఒక సూపర్ మార్కెట్ ను మెయింటెన్ చేయటం మాములు విషయం కాదు. ఎక్కడి వస్తువులు అక్కడ సరిగ్గా ఉన్నాయా లేవా? ధర ట్యాగ్ లు కరెక్ట్ గా ఉన్నాయా? అసలు షాఫింగ్ మాల్ శుభ్రంగా ఉంటుందా? ఇలా సవాలక్ష వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది. కానీ, కేప్ టౌన్ లోని స్పార్ స్టోర్ లో మాత్రం డెయిరీ సెక్షన్ వద్ద ఎవరూ ఊహించని ఓ ఘటన చోటుచేసుకుంది.

సూపర్‌ మార్కెట్ లో షాపింగ్ కు వచ్చిన ఓ మహిళా క‌స్టమ‌ర్ డెయిరీ విభాగం వద్ద ప్రిడ్జ్ లో చెయ్యి పెట్టి కెవ్వుమని అరిచింది. కారణం ఆమె పట్టుకుంది పాల ఉత్పత్తుల ప్రొడక్ట్ కాదు, ఓ 12 అడుగుల కొండ‌చిలువను. అంతే భ‌యంతో వ‌ణికిపోయిన ఆ క‌స్టమ‌ర్ దూరంగా ప‌రుగులు తీసింది.

ఆ అరుపులకు పరిగెత్తుకుంటూ వచ్చిన సూప‌ర్ మార్కెట్ సిబ్బంది వెంటనే పాములు పట్టే వారికి సమాచారం అందజేశారు. పాములు పట్టుకునే వారు దాన్ని పట్టు‌కునేందుకు ఫ్రిడ్జ్‌లో ఉన్న అన్ని వ‌స్తువుల‌ను బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం ఆఫ్రికన్ పైతాన్ ను ప‌ట్టుకొని నేష‌న‌ల్ పార్క్‌లో వదిలేశారు. ఆ పాము సూప‌ర్ మార్కెట్‌లోకి రూఫ్ లేక డ్రైనేజీ ద్వారా మార్కెట్ లోకి వచ్చి ఉంటుందని, వేడి తాళలేక ఇలా ఫ్రిడ్జ్ వ‌ద్ద‌కు చేరి లోపలికి దూరి ఉంటుందని భావిస్తున్నారు.

సాధారణంగా వీటికి విషం ఉండదు. కాకపోతే తమకు చిక్కిన ప్రాణులను నలిపి మింగేస్తాయి అంతే. అయితే ఫ్రిడ్జ్ లో దూరాక కూడా బతికి ఉండటం ఏంటని? ఇదంతా పబ్లిక్ స్టంట్ అయి ఉండొచ్చనే పలువురు అభిప్రాయ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Africa  Super Market  Fridge  Python  

Other Articles