మనుషుల్లో నేర ప్రవృత్తి బాగా పెరగిపోతుంది. మనిషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఎక్కడో కరుడుగట్టిన ఉగ్రవాదులు అత్యంత ఘోరకళికి అజ్యం పోస్తున్నారని, కనివిని ఎరుగని దారుణంగా శిక్షలతో మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నారని వింటుంటేనే మనలో భాయందోళన కలుగుతుంది. అయితే అంతకంటే దారుణంగా ఊహకందని విధంగా మెక్సికోలో నేరగాళ్లు తమ ప్రత్యర్థులను మట్టుబెడుతున్నారు.
విమానం గాల్లో వెళ్తుండగా, అందులోంచి ఓ వ్యక్తిని కిందకు పడేసి తమ కసి తీర్చుకున్నారు ప్రత్యర్థులు. అయితే ఈ ఘటనతో అలెర్ట్ అయిన స్థానికులు అదే విమానాన్ని పరిశీలించి చూడగా మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదే విధంగా విమానం నుంచి కింద పడేశారని స్థానికులు చెబుతున్నారు. విమానం నుంచి ప్రత్యర్థి గ్యాంగులకు చెందిన వ్యక్తలను ఇలా పడేయటం మెక్సికోలో పెను కలకకలం రేపుతోంది. మెక్సికోలోని డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు అఘాయిత్యాలకు పాల్పడటం కొత్తకాదు. అయితే ఈ తరహా నేరాలు మాత్రం ఇప్పటి వరకు జరగలేదు.
ప్రత్యర్థి ముఠా సభ్యులపై అధిపత్యం చెలాయించడం కోసం అక్కడ నేరాలు జరుగుతూనే వుంటాయి. అయితే ఈ నేరాలన్నింటినీ ప్రజలు చూసి భయాంధోలన చెందే విధంగానే వుంటాయి. కానీ తొలిసారిగా ఇలాంటి నేరం నమోదైంది. మెక్సికోలో డ్రగ్స్ ముఠాలు జడలు విప్పే నాట్యమాడే ప్రాంతమైన సినోలా రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో నుంచి ఒక వ్యక్తిని బిల్డింగ్పై పడేశారు. ఎల్డొరాడో నగరంలోని ఐఎమ్ఎస్ఎస్ ఆసుపత్రి మీద ఆ వ్యక్తి శరీరం పడిందని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన హెల్త్ అధికారి ఒకరు తెలిపారు.
ఆసుపత్రి రూఫ్ నుంచి వ్యక్తి శరీరాన్ని లోపలికి తీసుకొచ్చి చికిత్స అందించే ప్రయత్నం చేసినా వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. అప్పటికే ఆ వ్యక్తి మరణించాడన్నారు. అయితే, వ్యక్తిని చంపి కిందకు పడేశారా? లేదా ప్రాణాలతోనే కిందకు పడేశారా? అనే విషయంలో వైద్యలు ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నారు. కాగా, సినోలా రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులు చేలరేగిపోవడం కొత్తంకాదన్న వార్తలు వినబడుతున్నాయి. 2016లో సినోలా డ్రగ్స్ అక్రమ రవాణా డాన్ చాపో గుజ్మెన్ ను పోలీసులు అరెస్టు చేసిన నాటి నుంచి ప్రతీకార దాడులకు ఎక్కువయ్యాని స్థానికులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more