అందుబాటులోకి ఆధార్ పే.. వేలిముద్రతోనే నగదు ట్రాన్స్ ఫర్.. Narendra Modi launches Bhim-Aadhaar platform in Nagpur

Narendra modi launches bhim aadhaar platform in nagpur

nation, Narendra Modi, Aadhaar, Bhim, Aadhaar Pay, Bhim Aadhaar, new app, biometric-based payment system, digital transactions, Nagpur, Ambedkar Jayanti, cashless transactions

PM Modi launched the BHIM-Aadhaar interface in Nagpur, on the occasion of Ambedkar Jayanti, it will allow users to make payments using just their fingerprint.

అందుబాటులోకి ఆధార్ పే.. వేలిముద్రతోనే నగదు ట్రాన్స్ ఫర్..

Posted: 04/14/2017 01:15 PM IST
Narendra modi launches bhim aadhaar platform in nagpur

పాత పెద్ద నోట్ల ర‌ద్దుతో డిజిటల్ ఏకానమీ దిశగా అడుగులు వేయాలని భావించిన కేంద్రం.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పిటికే అనేక పే బ్యాంకులకు అనుమతినిచ్చిన కేంద్రం బ్యాంకు ఏటీయం కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్టులతో పాటు స్మార్ట్ పోన్లు లేని వారి కోసం కొత్తగా భీమ్ అధార్ యాప్ ను కూడా ఇవాళ అందుబాటులోకి తీసుకువచ్చింది. అంబేద్కర్ జయంతని పురస్కరించుకుని ఇవాళ మహారష్ట్రలోని నాగ్ పూర్ లో ప్రధాని నరేంద్రమోడీ ఈ యాప్ ను లాంఛనంగా ప్రారంభించి వ్యాపార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ భీమ్ ఆధార్ యాప్ ద్వారా ఆధర కార్డు వున్న ప్రతీ ఒక్కరూ ఎలాంటి కార్డులు లేకుండా తమ చెల్లింపులు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షల మంది వ్యాపారులు ఈ యాప్ లో చేరారని, త్వరలో దేశంలోని అందరు వ్యాపారులను దీని పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ప్రజలు కార్డులు లేకపోయినా కేవలం తమ వేలిముద్రలతోనే చెల్లింపులు చేసే సౌలభ్యం ఈ ఆధార్ పే కల్పింస్తుందని చెప్పారు.

అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా.. నగదు ఉపసంహరణ కూడా చేసుకునే వీలు మాత్రం ప్రస్తుతం కల్పించడం లేదు. ప్రస్తుతం కేవలం వ్యాపారులు మాత్రమే దీనిని వినయోగించుకును వారి కస్టమర్ల నుంచి నగదు చెల్లింపులు చేసుకునే అవకాశం మాత్రమే కల్పించారు. అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో నగదు రహిత చెల్లింపులు చేసిన పక్షంలో వారికి పడే సర్వీసు టాక్స్ ఈ ఆధార్ పే ద్వారా మాత్రం ఉండదని, ఈ మేరకు కేంద్రం మినహాయింపులు కల్పించిందని చెప్పారు. అయితే చెల్లింపులు సమయంలో తమ డబ్బులను ఖచ్చితంగా చూసుకోవాలని ప్రధాని ప్రజలకు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm modi  Aadhaar Pay  Bhim Aadhaar  digital transactions  Nagpur  Ambedkar Jayanti  

Other Articles