అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సొంత పార్టీపైన విమర్శలు గుప్పించి.. తాను ఎస్సీ, ఎస్టీలకు ఏం సమాధానం చెప్పాలని ఎదురు ప్రశ్నించారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తాను అ పార్టీకి చెందిన నాయకుడినే అన్న విషయాన్ని మర్చిపోలేదు కానీ.. తాను ఎన్నికైన తరువాత కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు పూర్తి కాకపోవడంతో.. తనను ఆయా వర్గాలకు చెందిన ప్రజలు నిలదీస్తున్నారని, దీనికి తాను ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఎంపీ అవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా మూడేళ్లు కావస్తున్నా.. తమ వర్గాలకు చెందని ప్రజల హామీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చెందంగా మారాయని అన్నారు తమ ప్రభుత్వం ఎస్టీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని భాదను వెళ్లగక్కారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సభలో చిత్తూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు. నవ్యాంధ్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికలల హామీలలో 90శాతం పూర్తి చేశామని, అయితే మిగిలిన ఆ పది శాతం తమ ఎస్సీ, ఎస్టీలకు చెందినవేనా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో జనాభా నిష్పత్తిలో 20శాతంగా వున్న తమకు మంత్రివర్గంలో మాత్రం రెండు పదవులే వరించాయని, మరో మూడు మంత్రి పదవులు తమ వర్గానకి దక్కాల్సి వున్నా వాటిని ఇవ్వలేదని ఆయన అరోపించారు. అటు కేంద్రంలో రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు వస్తే రెండూ ఓసీలకే ఇచ్చారని.. డిప్యూటీ సీఎం పదవులను బీసీలకు ఇచ్చారని.. అన్నింటినీ అందరికీ ఇచ్చి.. తమ వరకు వస్తే మాత్రం మోసం చేయడమే టీడీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆయన అరోపించారు.
డీకేటీ భూములకు పట్టాలను ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లవుతున్నా వాటి ఊసే తీయడం లేదన్నారు. పరిశ్రమ డీకేటీ భూములను లాక్కుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుని ఓనర్లను శ్రామికులుగా మారుస్తున్నారని అరోపించారు. ప్రభుత్వ భూములు కబ్జా అయినా పట్టించుకోరుచచ కానీ వాటిలో దళితులు ఉంటే మాత్రం ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకో న్యాయం, పైవర్గాల వారికి మరో న్యాయం కోనసాగుతుందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారు.. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్ లు కట్ చేస్తున్నారు.. బ్యాక్ లాగ్ ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని శివప్రసాద్ ధ్వజమెత్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more