చిరుత పులి మంచి అకలి మీద వుంది. అప్పుడు అటుగా వస్తున్న రెండు ముళ్ళపందులను చూసింది. వాటిని వెంటాడే క్రమంలో చావు తప్పి కన్ను లోట్టపోయే పరిస్థతికి వచ్చింది. రెండు ముళ్ల పందులు. తమని వేటాడడానికి వచ్చిన చిరుత పులిపై ఎదురుదాడికి దిగడంతో అంతపెద్ద దిట్టైన చిరుత తోక ముడుచుకుంది. ఆకలి సంగతి దేవుడెరుడు.. ముళ్లు తీస్తే చాలు అంటూ అంగలార్చింది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో చోటు చేసుకుంది.
రెండు ముళ్లపందులు మెల్లగా వెళ్లడం చూసిన చిరుతపులి.. అకలితో వుండటంతో అదను చూసి ఒక దానిపై దాడి చేసింది. అది ప్రతిఘటించడంతో తోకముడిచిన చిరుత తన ఓటమిని అంగీకరించకుండా.. అటుగా వస్తున్న రెండో ముళ్లపందిని చూసి దానిపైవుకు పరుగు తీసి దానినిపై దాడి చేసింది. చిరుత దాడిని ఊహించిన రెండో ముళ్లపంది తన ముళ్లంటినీ విచ్చుకునేలా చేసింది. వాటితో చిరుతను దాడి చేసింది. అప్పటి వరకు కింగులా వున్న చిరుత కాస్తా ఖంగుతినక తప్పలేదు.
ముళ్లపందులపై దాడి చేసి తోకముడిచిన చిరుత నోట్లోకి, పొట్టలోకి ఆ ముళ్లు దిగిపోయాయి. చిరుత బాధతో చేసేది లేక ఆ ముళ్లను వదిలించుకుంది. ఈ తతంగాన్నంతా పార్కును సందర్శించడానికి వచ్చిన ఓ యువకుడు ఫోన్‌లో రికార్డు చేసి యూట్యూబ్‌లో ఉంచడంతో వైరల్‌గా మారింది. దీంతో తన బలంతో విర్రవీగుతూ.. పరులను తక్కవ అంచనా వేయరాదన్న విషయం చిరుతకు ఇప్పటికైనా తెలిసివచ్చినట్లైంది. ఇక ఎందుకు అలస్యం మీరు ఈ వీడియోపై లుక్ వేయండీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more