పూర్ ఇండియా కామెంట్స్... స్నాప్ చాట్ కు చుక్కలు చూపిస్తున్న మన హ్యాకర్లు | Snap chat CEO says India too poor for expansion; gets slammed on Twitter.

Indians take to social media to snap at snapchat

Snapchat CEO Evan Speigel, Snapchat Poor India Comments, Poor India Snapchat, Snap Chat India, App-Solutely Not Cool, Snap Chat Snap Deal, India is poor snap chat, Evan Speigel India, Snapchat Hack, Snapchat India, snapchat Snapdeal

Snapchat CEO Evan Speigel denies ‘India is poor’ remark, calls the allegation ridiculous. Netizens uninstall Snapdeal app instead of Snapchat.Miffed with Snapchat CEO Spiegel, Indian hackers leak data of 1.7 million app users.

‘పూర్ ఇండియా’ కామెంట్లపై తీవ్ర దుమారం

Posted: 04/17/2017 08:26 AM IST
Indians take to social media to snap at snapchat

'పూర్ ఇండియా' కామెంట్ పై సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్ పై తీవ్ర విమర్శలు వచ్చిపడుతున్నాయి. స్నాప్ చాట్ యాప్‌ కేవలం ధనికుల కోసమే తప్ప ఇండియా, స్పెయిన్ వంటి పేదలున్న దేశాల కోసం కాదని ఇవాన్ స్పీగల్ గతంలో వ్యాఖ్యానించినట్టు ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియానో వెల్లడించాడు. వెరైటీ అనే అమెరికన్ వెబ్ సైట్ తన కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు అప్లికేషన్ యూజర్ల గణాంకాలను ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపిందంటూ సంస్థపై పొంప్లియానో దావా కూడా వేశాడు.

దీంతో ఇండియాను చులకన చేసి వ్యాఖ్యలు చేసిన స్నాప్ చాట్, దాని సీఈవో స్పీగల్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా, పరిస్థితి మరింత ముదురక ముందే రంగంలోకి దిగిన స్నాప్ ఛాట్ వివరణ ఇచ్చుకుంది. మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని, మాజీ ఉద్యోగి మాట్లాడిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయిస్తామని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ సంస్థ భవిష్యత్ వ్యూహాల గురించి పాంప్లియానోకు ఎంతమాత్రమూ తెలియదని చెప్పుకొచ్చింది. ఇక 1.7 మిలియన్ యాప్ యూజర్ల డేటాను ఇండియన్ హ్యాకర్లు లీక్ చేశారన్న వార్తలు కూడా అవాస్తవమని తెలిపింది.

భారతీయ మార్కెట్లో ఇప్పుడు మొబైల్ - డాటా విప్లవం కొనసాగుతున్నది. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ మనదే. జియో పుణ్యమాని ప్రస్తుతం దేశంలో డాటా వినియోగం కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో అహంకారపూరిత వ్యాఖ్యలతో భారతీయుల మనోభావాలను దెబ్బతీసి చిక్కుల్లో పడింది స్నాప్ ఛాట్. కాగా, 2011లో స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ విద్యార్థులు ఈవాన్ స్పీగల్, బాబీ ముర్ఫీ, రెగ్గీ బ్రౌన్ లు ఈ యాప్ ను ప్రవేశపెట్టగా, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా దీన్ని వాడుతున్నారు. గత నెలలో సంస్థ ఐపీఓకు రాగా, 3.4 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే.

పొరపాటున స్నాప్ డీల్ అనుకుని...

ఇక అహంపూరిత వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో వైరల్ కాగా, కొందరు స్నాప్ చాట్ బదులు స్నాప్ డీల్ అని ప్రచారం చేయటం, ఆపై స్నాప్ డీల్ యాప్ ను తొలగించటం జరిగిపోయాయి. తర్వాత అసలు విషయం తెలుసుకున్న సీఈవో కునాల్ బల్ తన ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Snapchat  India  Poor Comments  

Other Articles