సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే ప్రతి వీడియో లేదా వార్త వెనుక మంచి కారణాలు వుంటాయి. తాజాగా సామాజిక మాద్యమంలో ట్రెండింగ్ అవుతున్న వీడియో ఏంటో తెలుసా.? నిజమండీ యూట్యూబ్‌లో ఓ వీడియో ఇప్పుడు తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ అ వీడియో ఏంటంటారూ..? అని అడుగుతున్నారా..? బైక్ పై వేగంగా వెళుతున్న ఓ యువకుడిని పలుకరించడే కాదు.. ఓరేయ్ దమ్ముంటే ఆగరా.. అంటూ సవాల్ విసురుతున్న వీడియో ఇది. అనుకోని అతిథి ఎవరై వుంటారు..? మనిషి మాత్రం కాదు.. మరైతే ఎందుకు పలకించబోయాడు.. అంటే ప్రాణభయంతో.. నిజమండీ.. ప్రాణమీదకు వస్తే ఎవరితోనైనా సవాల్ విసరడానికి రెడీ అన్నట్లు ఆ జీవి కూడా బైకిస్టు పైకి ఎగిరేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యింది. ఇంతకీ అతిధి ఎవరని అడుగుతున్నారా.. ఇంకెవరండీ శివుడి కంఠాభరణం.. పాము. ఈ నెల (ఏప్రిల్) 16న థాయిలాండ్‌లోని లాంపాంగ్ రోడ్డులో పట్టపగలు ఓ వ్యక్తి బైక్ వేసుకొని వేగంగా వెళుతున్నాడు. అతడి వెనుకాలే ఓ కారులో కొంతమంది వస్తున్నారు.
వారు సరదాగా రోడ్డు వెంట వీడియోలు తీస్తూ డ్రైవ్ చేస్తున్నారు. అంతలో తమ కారును దాటేసి ముందుకెళ్లిన బైక్‌పై వారి దృష్టిపడి ఆ బైకిస్టును వీడియో తీయడం మొదలుపెట్టారు. ఈలోగా అక్కడ ఏదో అనూహ్య సంఘటన జరగబోతున్నట్లు వారికి అనిపించింది. ఎందుకంటే రోడ్డుపక్కనే ఉన్న చెట్లల్లో నుంచి ఓ పెద్ద పాము రోడ్డు దాటడం ప్రారంభించింది. సరిగ్గా అది వచ్చే సమయానికి బైకిస్టు కూడా వెళ్లాడు. దీంతో భయంతో ఆ పాము కాస్త ఎక్కడ బైక్ కింద పడతానో అని ఎగిరి దూకింది.
ఆ సన్నివేశం ఎలా కనిపించిందంటే ఓరేయ్ నీకు దమ్ముంటే అగరా.. అని పాము బైకిస్టుకు సవాల్ విసురుతున్నట్లగా వుంది. అదృష్టవశాత్తు అతడు బైక్ వేగం పెంచడంతో పాముకు అందకుండా పోయాడు. వాస్తవానికి అది భయంకరమైన విష సర్పం. ఈ దృశ్యం అంతా కారులో వెళుతున్న వారి కెమెరాకి చిక్కింది. వారు ఆ వీడియోను రెండు రోజుల క్రితమే యూ ట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియోను ఇప్పటివరకు 23 లక్షల మందికి పైగా చూశారు. దీంతో ఆ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 26 లక్షలమంది వీక్షించారు. మరెందుకు అలస్యం.. మీరూ చూడండీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more