పెట్రోల్ బంకులకు అదివారం సెలవు దినంగా ప్రకటించే విషయంలో మరో ఊహించిన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తమ ప్రధమ డిమాండ్లు పరిష్కరించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకుంటామని పెట్రోబంకుల డీలర్ల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే నెల 14 నుంచి దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు అదివారం మూసివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సరికొత్తగా వచ్చిన ట్విస్ట్ నేపథ్యంలో పెట్రలు బంకుల డీలర్లు ముందుగా తమ ప్రధమ డిమాండ్లను కేంద్రం, చమురు సంస్థలు పరిష్కరించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకుంటామని తేల్చిచెప్పారు.
తమకు అందించే కమీషన్ ను ముందుగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న కమీషన్ కు బదులుగా పెట్రోలుపై లీటరుకు ఇస్తున్న రూ.2.56, డీజిల్‌పై ఇస్తున్న రూ.1.65 కమీషన్‌ను పెంచాలని డీలర్ల సంఘాలు గత కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నాయి. డీలర్ల డిమాండ్‌పై వచ్చే నెల 10న కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరించనుంది. దీంతో కేంద్రం ప్రకటించే కమీషన్ ను చూశాకే ఆదివారం సెలవు అమలుపై నిర్ణయం తీసుకుంటామని డీలర్ల సంఘాలు చెబుతున్నాయి.
అదివారం సెలవుపై అటు బంకులు యాజమాన్యాలతో పాటు ఇటు వాహనదారులు కూడా పెదవి విరుస్తున్నారు. నిత్యవసరాలు మారిన ఇంధనం సరఫారా చేసే బంకులకు సెలవు దినాలేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెట్రోలు బంకులు అదివారం సెలవులు ప్రకటించడంతో ప్రైవేటు బంకుల యాజమాన్యాలు ఈ నిబంధనను పాటించవని.. ఈ నిర్ణయంతో ప్రైవేటు యాజామాన్యాలకు లాభమే తప్ప.. ప్రభుత్వ బంకులు ఎలాంటి లబ్ది చేకూరదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
అదివారం పెట్రోలు బంకులు బంద్ చేయడం వల్ల శనివారం రోజునే వాహనదారులు తమ వాహనాలలో పెట్రోల్ కోట్టించుకుంటారని, దీంతో బ్లాక్ మార్కెట్ దారులు లబ్దిపోందే అవకాశాలే అధికమన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదివారం పూట అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. పెట్రోల్ బ్లాక్ మార్కెట్ లో ఖరీదు చేయాల్సి వస్తుందని, ఈ నిర్ణయంతో మళ్లీ పాత రోజులకు వెళ్లినట్లు అవుతుందని చెప్పారు. పెట్రోలు వాడకాన్ని తగ్గించి ఇంధన వనరులను పరిరక్షించుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం పెట్రోలు బంకులు మూసివేయాలని నిర్ణయించుకున్న బంకు యాజమాన్యాలు.. ఈ నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే కేంద్రం తమ ప్రధమ డిమాండ్ ను పరిష్కరించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకుంటామని డీలర్ల సంఘం స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more