భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన పాపులారిటీతో మరో సత్తా చాటాడు. టైమ్ పత్రిక ప్రతి ఏటా ప్రకటించే అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తుల్లో మోదీ నిలిచారు. గురువారం ఈ మేరకు టైమ్ మాగ్జైన్ 2017 జాబితాను విడుదల చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లతో అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన మేనియా మూడేళ్ల తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదని టైమ్ పత్రిక పేర్కొంది. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ పరంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పింది. ఇక ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘనవిజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
భారత్ నుంచి మరో వ్యక్తి కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాడు. నోట్ల రద్దు తర్వాత బాగా వ్యాప్తిలోకి వచ్చిన పేటీఎం సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ఆయన ముందుండి నడిపిస్తున్నారని టైమ్ కొనియాడింది. ముఖ్యంగా గత నవంబర్ లో భారత ప్రభుత్వం అనూహ్య రీతిలో 86 శాతం ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసిందని, ఆ తర్వాత పరిస్థితులను విజయ్ సరిగ్గా వినియోగించుకున్నాడని ప్రశంసించింది. గత ఏడాది ప్రారంభం నాటికి పేటీఎంకు 12.2 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, సంవత్సరం తిరిగే నాటికి వారి సంఖ్య 17.7 కోట్లకు చేరుకుందని పేర్కొంది. ఓ మారుమూల పల్లెటూరి నుంచి వచ్చి హిందీ మీడియంలో విద్యాభ్యాసం చేసిన విజయ్, డిజిటల్ ఎకానమీలో పై చేయి సాధించటం అద్భుత విజయమని కొనియాడింది. ప్రస్తుతం చైనా దిగ్గజ కంపెనీలై అలీబాబా, జాక్మా కంటే పేటీఎం వృద్ధి గణనీయంగా ఉందని తెలిపింది.
ఇక ఇదే జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా చోటు సంపాదించుకున్నారు. వారి శక్తి సామర్థాలు, మేధస్సు, వారి సాధించిన విజయాలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని టైమ్స్ ఈ జాబితాను ప్రతీ యేడూ విడుదల చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more