Nitish Kumar to run for presidential elections | నెక్ట్స్ రాష్ట్రపతి నితీశే.. అసలు అంత సీన్ ఉందా?.

Nitish kumar in president race

Janata Dal (United), Nitish Kumar, Bihar CM Nitish, Nitish Sonia President Election, Tyagi Nitish Kumar, Nitish Kumar President, Nitish Kumar Next President, Nitish Kumar Pranab Mukharjee, Nitish President Race, Nitish Kumar Modi President Elections, JDU Congress President Elections

Janata Dal (United) national president and Bihar Chief Minister Nitish Kumar is experienced and capable of becoming the President of India, and he will contest the coming Presidential election, party’s general secretary K.C. Tyagi told a district-level JD(U) workers’ meet here on Sunday.

రాష్ట్రపతి రేసులో నితీశ్ కుమార్??

Posted: 04/25/2017 08:00 AM IST
Nitish kumar in president race

జనతాదళ్ (యూనైటెడ్) జాతీయ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి రాష్ట్రపతి రేసులో నిల్చోబోతున్నాడా? అన్న డౌట్లు వ్యక్తం చేయకండి. ఎందుకంటే అవి కేవలం ఓ నేత చేసిన వ్యాఖ్యలు మాత్రమే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం త్వరలో ముగియబోతుండటంతో కొత్త రాష్ట్రపతి ఎవరా? అన్నదానిపై చర్చ జరుగుతుండగా, నితీశ్ పేరును ఉటంకించాడు కేసీ త్యాగి.

జేడీ(యూ) పార్టీ కార్యదర్శి అయిన త్యాగి ఆదివారం కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హుడని ఆయన పేర్కొన్నారు. నితీశ్ కుమార్ రాష్ట్రపతి కావాలని జేడీయూ సహా భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. ఈ విషయమై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అదే సమయంలో మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని త్యాగి పిలుపునిచ్చాడు. నాలుగు రోజుల క్రితం నితీశ్ సోనియా గాంధీని కలుసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే వీరి చర్చ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరును తెర మీదకు తెచ్చింది శివసేన. రాష్ట్రపతి పదవికి ఆయన అన్ని విధాల అర్హుడని శివసేన కార్యదర్శి సంజయ్ రనౌత్ పేర్కొన్నాడు. మరోపక్క ఎవరి మద్ధతు అవసరం లేకుండా ఏకపక్షంగా రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం దక్కించుకున్న బీజేపీ తరపు నుంచి అద్వానీ లాంటి అగ్రనేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అన్ని పార్టీల మద్ధతు ఉండటంతో ప్రణబే రెండో దఫా రాష్ట్రపతిగా కొనసాగే అవకాశం లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Nitish Kumar  President Race  

Other Articles