ఓరి దేవుడా లోకం మారెరా.. అంటూ పాటను అలపించాల్సిన పరిస్థితులు భారత్ దేశంలోనూ ఉత్పన్నమవుతున్నాయి. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం వివాహమంటే అత్యంత పవిత్రమైన వేడుక. ఒక యువకుడు, యువతి మధ్య పెనువేసుకోనున్న నూరేళ్ల బంధం. కానీ దేశంలో పరిస్థితులు పాశ్యాత సంస్కృతి దిశగా శరవేగంగా పయనిస్తున్నాయి. అందుకు పంజాబ్లో చోటుచేసుకున్న ఈ విచిత్ర పెళ్లి వేడుకే నిదర్శనం. హైందవ ధర్మాలను అచరిస్తూ జరిగిన ఈ పెళ్లిలో ఓ మహిళ మరో యువతి మెడలో తాళి కట్టి తన అర్థాంగిగా చేసుకుంది.
వివరాలోక్లి వెళ్తే.. పంజాబ్ మహిళా ఎస్ఐగా విధులు నిర్వహిస్తుందని జాతీయ మీడియా వెల్లడించినా.. తాను పోలీసు శాఖ ఉద్యోగిని కానని, అయితే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నాని తనకు తానుగా వెల్లడించిన మంజీత్ కౌర్ సంధూ.. హిందూ సంప్రదాయం ప్రకారం జలంధర్ నగరంలో 27 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులు హాజరయ్యారు. ఓ మహిళతో మరో మహిళకు పెళ్లి కావడంతో వారి వివాహ వేడుక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాగా స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ పరిణయం.. అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాహంపై నెట్ జనులు కూడా తమ కామెంట్లను పోస్టు చేస్తున్నారు. ఈ పెళ్లిని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వలింగ వివాహాలు నేరం అని మరికొందరు అంటున్నారు. ఇంకోందరు మాత్రం ఇప్పటికే పంజాబ్ యువతకు సరిపోయే సంఖ్యలో యువతులు లేరని.. ఇక ఇలాంటి వివాహాలు జరిగితే.. యువకులు కూడా అదే బాట పట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని పలువరు నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more