'Arrest Chandrababu Naidu For The Same Reason' అడ్డంగా దొరికిన బాబునెందుక వదిలారు.?

Botsa satynarayana demands for chandrababu naidu arrest

Polavaram project, cash-for-vote scam, TDP-led government, chandrababu naidu scams, Bhavanpadu port, YSRCP spokesman Botsa Satyanarayana, TTV Dinakaran, bribe, Election Commission, Andhra pradesh, Chandrababu Naidu, PM Modi, bjp, tdp, ysrcp, pawan kalyan, jana sena

If AIADMK's Dinakaran can be arrested on charges of trying to bribe Election Commission officials then chief minister N Chandrababu Naidu can also be arrested on similar charges, YSRCP spokesman Botsa Satyanarayana said.

దినకరన్ ను అరెస్టు చేసి.. చంద్రబాబును ఎందుకు వదిలేశారు..?

Posted: 04/27/2017 09:02 PM IST
Botsa satynarayana demands for chandrababu naidu arrest

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమ‌ర్శలు గుప్పించారు. కేంద్రం ప్రభుత్వం తమ మిత్రుల పట్ల ఒకలా, తమ వ్యతిరేక వర్గం వారి పట్ల మరోలా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికల కమీషన్ కు లంచం ఇవ్వజూపిన కేసులో తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ ధినకరన్ ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు.. అదే తరహా నేరానికి పాల్పడి.. సాక్షాధారాలను రెండు రాష్ట్రాల ప్రజలు విన్నవ తరువాత కూడా తమ మిత్రపక్షానికి చెందిన నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు.

ఓటుకు నోటు కేసులో తమ పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డిన పంపించడంతో పాటు అడ్డంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా ఇంకా తాను నీతివంతుడ్ని అంటూ బుకాయించి మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీల‌కు పాల్పడుతోంద‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు.

భావనపాడు పోర్టుకు గ్లోబల్‌ టెండర్లు ఎందుకు పిలవలేదని ఆయ‌న అడిగారు. పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను ఏపీ స‌ర్కారుకి ఇవ్వడానికి జరిగిన ఒప్పందాల వెనక ఏమి జ‌రిగింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో ఏపీ స‌ర్కారు త‌మకు ఇష్టం వ‌చ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చి దోచుకున్నట్లుగానే భావనపాడులో కూడా మరో దోపిడికి సిద్ధమయింద‌ని ఆయ‌న ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Botsa Satyanarayana  TTV Dinakaran  bribe  Election Commission  mla  chandrababu  

Other Articles