భారత సాప్ట్ వేర్ దిగ్గజ సంస్థలను టార్గెట్ చేస్తూ బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అగ్రరాజ్యంలో అక్కడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో అక్కడి నుంచి భారతీయులు స్వదేశానికి పయనం అవుతున్న నేపథ్యంలో దేశంలోని సాప్ట్ వేర్ సంస్థలకు కూడా బెదిరింపులకు దిగుతూ మరో విధమైన అంధోళన రేకిస్తుంది. దీంతో దేశ ఐటీ రంగం భవిష్యత్తు ఏమిటోనన్న భయాందోళన ఉద్యోగులలో నెలకొంది. తాజాగా బెంగళూరులోని విప్రో ప్రధాన కార్యాలయానికి వచ్చిన బెదరింపు లేఖ ఐటీ సంస్థలతో పాటు ఐటీ నిపుణలను కూడా తీవ్ర కలవరానికి గురిచేస్తుంది.
బెంగళూరులోని విప్రో సంస్థ ప్రధాన కార్యాలయానికి వచ్చిన లేఖలో అగంతకులు తాము చెప్పిన అడ్రస్ కు ఏకంగా రూ.500 కోట్లు పంపాలని పేర్కోన్నారు. లేని పక్షంలో ఆఫీసును పేల్చేస్తామని తెలుపుతూ గుర్తు తెలియని ఆగంతకుడు ఆఫీస్కు మెయిల్ పంపాడు. తాము విప్రో కార్యాలయంలో అల్లకల్లోలం సృష్టిస్తామని ఇందుకోసం ఒక రసాయనక పధార్థం కూడా సిద్దంగా వుందని అగంతకులు తమ లేఖలో పేర్కోన్నారు. తాము కోరిన విధంగా రూ. 500 కోట్ల రూపాయలను బిట్ కాయిన్ల రూపంలో చెల్లించాలని పేర్కోన్నారు.
అలా చేయని పక్షంలో తమ వద్ద వున్న కిలో రసాయనక పదార్థం రిసిన్ ను కార్యాలయానికి పంపుతామని, దాంతో విప్రో ఉద్యోగులందరూ ఉక్కిరిబిక్కిరై ప్రాణాలను వదులుతారని కూడా హెచ్చరించారు. ఈ బెదిరింపు లేఖపై స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విప్రో అధికారులు ఫిర్యాదు నమోదు చేశారు. సైబర్ టెర్రర్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఈమెయిల్ ను ఒక వ్యక్తి పంపారని తెలుసుకున్నారు. ఇక అది ఎక్కడినుంచి వచ్చిందో గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఎవరైన ఆకతాయిలు ఈ పని చేశారా అన్నా కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more