Ananth Kumar, Yeddyurappa told to appear before IO యడ్యూరప్పకు కొత్త కష్టాలు.. స్వర పరీక్షకు కోర్టు అదేశం

B luru court orders bsy ananth kumar to give voice samples

bengaluru voice samples sessions court, court summons yeddurappa, court summons ananth kumar, bjp, karnataka bjp, B.S. Yeddyurappa, K.S. Eshwarappa, mysuru news, karnataka news, politics

Former CM and BJP state president BS Yeddyurappa and Union Minister Ananth Kumar have been directed by a city court to appear before the investigating officer and give their voice samples.

యడ్యూరప్పకు కొత్త కష్టాలు.. స్వర పరీక్షకు కోర్టు అదేశం

Posted: 05/07/2017 08:54 AM IST
B luru court orders bsy ananth kumar to give voice samples

కర్ణటక బీజేపి అధ్యక్షుడు యడ్యూరప్ప కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. సరిగ్గా ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో పార్టీని మరోమారు అధికారంలోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో వున్న ఆయన ఏకంగా అటు పార్టీని ఇటు స్వంతంగానూ కష్టాలు తెచ్చుకున్నారు. కొంతమంది నేతలు నోటి దూళతో ప్రజలకు దూరం అవుతారు. అయితే మరికొంత మంది మాత్రం అదే నోరు జారి కష్టాలను కొని తెచ్చుకుంటారు. సరిగ్గా అలాంటి వ్యాఖ్యలలు చేసి యడ్యూరప్ప ఇరుకున పడ్డారు. ఏకంగా న్యాయస్థానం నుంచి శ్రీముఖాలను అందకున్నారు.

కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ తో కలసి యడ్యూరప్ప బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో యడ్యూరప్పకు బెంగళూరు సెషన్స్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే వీరు చేసిన అ సంచలన వ్యాఖ్యలు ఏమిటీ..? వాటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం యడ్డీకి నోటీసులు ఎలా జారీ చేసింది. అన్న సందేహాలు అందరిలోనూ తలెత్తడం కామన్.

రెండు నెలల క్రితం నగర బీజేపీ కార్యాలయంలో అనంతకుమార్ తో కలసి యడ్డీ.. మాట్టాడుతూ.. తాము కూడా హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చామని. అయితే ముడుపులను అందరికీ తెలిసేటట్టు ఇస్తామా అని ఒకరికొకరు చెప్పుకున్నారు. దీంతో హైకమాండ్ కు ముడుపులిచ్చి పదవులను తెచ్చుకున్నారని.. రాష్ట్రంలో అధికారంలో  వున్న కాంగ్రెస్ ఈ వీడియోను బయటపెట్టింది. ఈ సీడీలను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఉగ్రప్ప సిటీ సైబర్ పోలీస్ స్టేషన్ లో అందజేసి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. పోలీసులు కోర్టును ఆశ్రయించగా వీరిద్దరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన వారం రోజుల వ్యవధిలో వీరిద్దరూ స్వర పరీక్షలకు హాజరు కావాలని ఆదేశించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  karnataka bjp  B.S. Yeddyurappa  K.S. Eshwarappa  mysuru news  karnataka news  politics  

Other Articles