విమానాలు ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్న ప్రమాదాలతో విమానయానంపై కూడా నమ్మకాలు సన్నగిల్లుతున్న తరుణంలో అలాంటి వాటికి చెక్ పెడుతూ.. విమాన ప్రయాణంపై భరోసా ఇవాల్సిన పెలైట్లు.. అందుకు బదులు ప్రయాణికులను మరింత అందోళనకు గురిచేసే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పైలట్లపై విమర్శలు కూడా వెల్లివిరుస్తున్నాయి. కొందరు మద్యం సేవించి విమానం నడిపేందుకు వస్తున్నారని, మరికొందరు తమ కాక్ పిట్ లోకి పోర్న్ స్టార్లను అనుమతించడం వంటి ఘటనల నేపథ్యంలో విమర్శనలు ఎదుర్కోంటున్నారు.
తాజాగా పాకిస్థాన్ అంతర్జాతీయ విమాన పైలట్ తన విధులను ఓ ట్రైనీ పైలట్ కు ఇచ్చి సుమారు 300 మంది ప్రయాణికుల ప్రాణాలను పనంగా పెట్టి.. తాను మాత్రం సుఖంగా నిద్రలోకి జారుకున్నాడు. ఆయనే అమిర్ అక్తర్ హష్మీ. ఈయన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో సీనియర్ పైలెట్. అయితే అయన సీనియర్ మాత్రమే కాదు పైలట్ అసోషియేషన్ సంఘానికి అధ్యక్షుడు కూడా. దీంతో తనను ఎవరేం అంటారని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ విమానం గాలిలో వుండగా ఎంచక్కా రెండున్నర గంటల పాటు కునుకు తీసి వార్తల్లో నిలిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. 300 మంది ప్రయాణికులతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి లండన్‌కు వెళుతున్న విమానానికి పైలట్ బాద్యతలు చేపట్టాల్సిన అమిర్ అక్తర్ హష్మీ.. టేకాఫ్ చేసిన తరువాత విమానం గాల్లో వుండగా.. తన బాధ్యత ట్రైనీ పైలెట్‌కు అప్పగించి.. ఆయన మాత్రం ఏకంగా అదే విమానంలో బిజినెస్ క్లాస్ కేబిన్‌లో రెండున్నర్ర గంటలపాటు గురుక తీశాడు. అలా ఆయన నిద్రిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అయ్యింది. అంతటితో అగని ప్రయాణికుడు ఈ ఫోటో అటు సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు ఎయిర్‌లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
అయితే హష్మీపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మీనమేశాలు లెక్కించారు. ఎందుకంటే అయన సీనియర్ పైలెట్ మాత్రమే కాదదు ఏకంగా పాకిస్తాన్ ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ అధికారులు ముందుగా భయపడ్డారు. అయితే పై స్థాయి అధికారులు విచారణకు ఆదేశించడంతో కొంత కదలిక వచ్చింది. హష్మీ ఫ్లైయింగ్ లైసెన్స్‌ను రద్దు చేసి విచారణకు ఆదేశించింది ఎయిర్‌లైన్స్ సంస్థ. ట్రైనీకి ట్రైనింగ్ ఇవ్వకుండా ఆ సమయంలో నిద్రకు ఉపక్రమించినందుకు గాను హష్మీపౌ వేటు వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more