డ్రెస్ కోడ్ నిబంధనంతో ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు హాజరైన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పాలయ్యారు. ముఖ్యంగా విద్యార్థినులకు టైం దగ్గర పడినా కొద్ది ఒక్కో కారణం చెబుతూ అధికారులు చుక్కలు చూపించారు. ఒకటి కాదు రెండు కాదు... దాదాపు ప్రతీ రాష్ట్రంలోనూ అభ్యర్థులను ఇబ్బందిపాలు చేయటమే లక్ష్యంగా పెట్టినట్లు ఉందని పలువురు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేరళలోని కన్నరూలో పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంతో పరీక్ష రాసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తొలగించి వస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చేసేది లేక దానిని తొలగించి లొపలికి వెళ్లింది. పరీక్ష హాలు నుంచి కంగారుగా బయటకు పరుగెత్తుకుంటూ వచ్చిన తన కూతురు చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి మళ్లీ అంతే వేగంగా లోపలికి వెళ్లిపోయిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పరీక్ష పూర్తియిన అనంతరం విద్యార్థిని కూడా ఏడుస్తూ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసింది.
ఇక కర్ణాటక లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఓ విద్యార్థినికి దాదాపు ఇదే రకమైన అనుభవం . పరీక్ష మరో 30 నిమిషాలు ఉందనగా చవెి రింగులు తీయాలని అధికారులు ఆదేశించారు. దీంతో కంగారు పడిన యువతి వాటిని తొలగించే తరుణంలో పోగు స్క్రూ ఇరుక్కుపోవటంతో నానా తంటాలు పడింది. ఇక తెలంగాణలో అల్వాల్ ఓ పరీక్ష కేంద్రానికి హాజరైన యువతుల ముక్కుపుడకలు కూడా తీయించేశారు. చెన్నైలో ఓ పరీక్ష కేంద్రానికి ఫుల్ స్లీవ్ తో(హాఫ్ స్లీవ్ మాత్రమే ఉండాలని రూల్) వచ్చిన అభ్యర్థుల బట్టలను అధికారులే దగ్గరుండి చించేయటం విశేషం.
కుర్తాపైజామాలు ధరించొద్దని, ఇన్నర్ వేర్ లు వేయొద్దని, బ్లాక్ పాయింట్, ఫుల్ స్లీవుల నిషేధం, షూలపై బ్యాన్.. ఇలా చివరి నిమిషంలో నీట్ డ్రెస్‌కోడ్ క్లాజ్ పేరుతో పలువురు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేయగా, ఇదసలు ‘నీట్’ గా లేదని పలువురు మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more