Girl Buried Alive In A Pit Over A Petty Property Dispute

Dad rescues his teenage daughter buried alive

Girl Buried Alive, Bihar Girl Buried Alive, Villagers Buried Girl, Property Issue Girl Buried, Father Rescue Buried Daughter, Buried Alive Video, Buried Girl Rescue, Bihar Video, Bihar Crime News, Bihar Girl Rescue, Dad Rescues Daughter Video

Teenage Girl buried alive over 'warning threat over property dispute' in Bihar. Father Resuced her after Two Hours with Villagers Help.

ITEMVIDEOS:బతికుండగానే యువతిని బొంద పెట్టేశారు

Posted: 05/12/2017 09:26 AM IST
Dad rescues his teenage daughter buried alive

ప్రాణాల విలువ తెలియని మృగాలు ఓ యువతితో ఆడిన వికృత క్రీడ ఇది. ఆమె తండ్రితో ఉన్న గొడవల రిత్యా పగను కూతురిపై చూపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ యువతిని బతికుండగానే సమాధి చేయాలని భావించారు. కానీ, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.

బీహార్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. గోవిందపూర్ గ్రామంలో స్థానిక వ్యాపారి అమిత్ షా.. బాధిత యువతి తల్లిదండ్రులు సంజన, అన్సారీలను వారి స్థలంలో ఓ భవనం కడతానని ప్రతిపాదించాడు. దానికి వారు అంగీకరించలేదు. దీనిపై గతంలో పలు మార్లు అమిత్ షా వారిని బెదిరించాడు. ఆ బెదిరింపులను వారు పట్టించుకోకపోవడంతో వారి ఇంటిపై దాడి చేసిన ఇద్దరు దుండగులు వారిని హెచ్చరించేందుకు ఇంట్లో ఉన్న వారి కుమార్తె ఖుష్బూ (19)ను కొట్టి, బలవంతంగా లాక్కెళ్లి దగ్గర్లో ఉన్న 3 అడుగుల గుంతలో పూడ్చిపెట్టారు.

 

ఖుష్బూ ఇంట్లో కనిపించకపోయేసరికీ అనుమానం వచ్చిన ఆమె తండ్రి చుట్టుపక్కల వెతికారు. ఇంతలో అక్కడ కొత్తగా గుంత కనిపించడంతో దానిని తవ్వి చూడగా ఖుష్బూ స్పృహ కోల్పోయి కనపడింది. దీంతో గ్రామస్థులతో పాటు కుటుంబ సభ్యులు ఆమెకు స్పృహ తెప్పించేందుకు చాలా ప్రయత్నించారు. షాక్‌ కు గురైన ఖుష్బూ కోలుకోకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి, అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఖుష్బూను గుంత నుంచి తీస్తున్న వీడియోను వారు పోలీసులకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Buried Alive  Bihar Girl  Rescue  

Other Articles