తన రాజకీయ ఆరంగ్రేటం విషయంలో మళ్లీ స్పష్టత ఇవ్వకుండా ఇష్టం లేదంటూనే మరోపక్క దైవాజ్న అంటూ వేదాంత ధోరణితో అర్థంకానీ రీతిలో ఓ స్టేట్ మెంట్ ఇచ్చిపడేశాడు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే రజనీ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చే జరిగింది. కానీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాత్రం కాస్త డిఫరెంట్ గానే స్పందించాడు.
'దేవుడు శాసిస్తే.. నేను రాజకీయాల్లోకి రావచ్చు' అని రజనీ అన్న మాటను ఓ పొలిటికల్ జోక్‌గా ఆయన అభివర్ణించాడు. రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని, ఆయనకు స్పష్టమైన సిద్ధాంతం లేదని విమర్శించారు. గతంలోనూ రజనీకాంత్ వేర్వేరు పార్టీలతో కలిశారే తప్ప, వాటిలోని సిద్ధాంతాలు కూడా పాటించలేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.
రజనీకాంత్ తన నిర్ణయాలను పదే పదే మార్చుకుంటారని విమర్శించాడు. అంతేకాదు అతను తమిళ సంతతి వ్యక్తి కాదు. మరాఠీ మూలాలు ఉండి బెంగళూర్ నుంచి వచ్చాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ రజనీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం దారుణం ఫేలవుతాడని జోస్యం చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more