సీనియర్ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి రిపబ్లికన్ టీవీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హిందుత్వ భావజాలం, జర్నలిజంకు నేతలంతా గులాం కొట్టాల్సిందేనంటూ ప్రతిరోజు తన వాదనను కొనసాగిస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలో అర్నబ్ కు గట్టి షాకే ఇచ్చింది మాజీ యాజమాన్యం టౌమ్స్ నౌ. కీలకమైన సమాచారం తమ వద్ద నుంచి దొంగిలించాడని దొంగతనం కేసును నమోదు చేసింది.
విషయం ఏంటంటే... మే 6న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆ పార్టీ నేత షాబుద్దీన్ మధ్య ఫోన్ సంభాషణల ఆడియో టేపులను, మే 8న సునందా పుష్కర్ తో అప్పటి తమ రిపోర్టర్ ప్రేమా శ్రీదేవి ఫోన్ సంభాషణల టేపులను వాడుకున్నారని ఆరోపించింది. ఈ రెండు ఆడియో టేపులు ప్రేమా శ్రీదేవి, అర్ణబ్ లు తమ సంస్థలో పని చేస్తున్నప్పటివని పేర్కొంది. తమ ఛానెల్ కు సంబంధించిన సమాచార కాపీలు ‘రిపబ్లికన్’లో ప్రసారమయ్యాయంటూ అర్ణబ్ పై ‘టైమ్స్ నౌ’ యాజమాన్య సంస్థ బెన్నెట్, కోల్మన్ అండ్ కో లిమిటెడ్ గ్రూప్ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అర్నబ్ దొంగతనం, క్రిమినల్, ఉల్లంఘన, ఆస్తి దుర్వినియోగం తదితర నేరాలకు పాల్పడినట్టు ఆ ఫిర్యాదులో ఆరోపించింది. అంతేకాదు ‘రిపబ్లికన్ టీవీ’ ప్రారంభించిన రోజున, ఆ తర్వాత తమ ఛానెల్ కు సంబంధించిన కొన్ని ఫుటేజ్ లను ఆయన వాడుకున్నాడని ఆరోపించింది. ‘టైమ్స్ నౌ’ మేధో సంపదను అర్నబ్, ప్రేమా శ్రీదేవి వాడుకోవడంపై పలు సెక్షన్ల కింద విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో కోరింది. అయితే తాను బయటికి వచ్చాక నైతికంగా ఓడిపోయిన టైమ్స్ నౌ ఏం చేయలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అర్నబ్ స్పందించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more