తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకుంటున్న ప్రియుడిపై ప్రతీకారంతో రగిలిపోయిన మాజీ ప్రియురాలు చేయకూడని పనులు చేసింది. సెంటిమెంట్లను బలంగా విశ్వసించే గడ్డపై అమె అదే సెంటిమెంట్లను అడ్డుపెట్టుకుని ప్రియుడి పెలళ్లిన అపాలని ప్రయత్నించింది. ఇంకేముందు విషయం పోలీసుల దృష్టికి వెళ్లడం.. వారు రంగంలోకి దిగి.. అనుమానాస్పద వ్యక్తల వివరాలను సేకరించడంలో ఈ నేపథ్యంలో ఓ రిక్షావాలా ఇచ్చిన క్లూతో ప్రియురాలని కటకటాల వెనక్కి నెట్టడం అన్ని చకచకా జరిగిపోయాయి, ఇంతకీ ప్రియుడిపై అగ్రహంతో రగలిపోయిన యువతి ఎలా ప్రతీకారాన్ని తీర్చుకుందో తెలుసా..?
తన పెళ్లి చేసుకుంటానని చేసిన బాసలు మర్చిపోయి.. మరో యువతితో పెళ్లికి సిద్దమవుతున్నాడనే ఆగ్రహంతో రగిలిపోయిన ప్రియురాలు ఏకంగా పెళ్లి పందిరికే నిప్పు పెట్టింది. ఇలా జరిగితే అశుభం అని.. దీంతో ప్రియుడి ఇంట్లో వాళ్లు పెళ్లిని జరిపించరని భావించింది. కానీ ప్రియుడి కుటుంబికులు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఎట్టకేలకు చిక్కింది. అయితే పెళ్లి మండపం తగలబడిపోతున్న క్రమంలో అక్కడే వున్న ఓ రిక్షా కూడా తగలబడింది. అ రిక్షా వాలా కొంత దూరం నుంచి గమనించిగా ఓ మహిళ పెళ్లిపందిరి వద్ద తచ్చాడుతుందని, అయితే పెళ్లివారి బంధువులని తాను భావించానని చెప్పాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వరుడుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు రెండు రోజుల ముందు సదరు బాధితుడికి సంబంధించిన బైక్ కి కూడా కొందరు నిప్పుపెట్టారు. ఈ రెండు ఘటనలకు లింక్ ఉందని భావించిన పోలీసులు... ఆ కోణంలో దర్యాప్తు చేశారు. భాధితుడిపై వ్యక్తిగతంగా ఎవరికైనా కక్ష ఉందా అని విచారించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు 36 ఏళ్ల ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసు విచారణలో రెండు నేరాలనూ తానే చేసినట్టు ప్రియురాలు సుష్మా గన్ పత్ తెమ్ఘర్ అంగీకరించింది. గత ఆరేళ్లుగా దీపక్ హరిబాహు రెనూస్ తో తనకు శారీరక సంబంధం ఉందని... తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతని తల్లిదండ్రులకు చెప్పినా వారు లెక్క చేయలేదని, అందుకే పెళ్లి పందిరిని తగలబెట్టానని చెప్పింది. బైక్ కూడా తాను బహుమతిగా ఇచ్చిందేనని... అందుకే దానికి నిప్పు పెట్టానని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఆదివారం వరకు కస్టడీ విధించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more