'Rajini is Uneducated, Unsuitable for Politics' ‘‘రజనీకాంత్ రాజకీయాలకు పనికిరాడా..?’’

Rajini is uneducated unsuitable for politics

Subramanian Swamy, Bharatiya Janata Party, BJP, Rajinikanth, RajinikanthUneducated, Rajinikanth politics, Rajinikanth pulse of fans, pulse of TN people, DMK, Stalin, kollywood, Tamil Nadu

BJP MP Subramanian Swamy downplayed the entire see-sawing development of Rajinikanth entry into politics saying he is 'unsuitable' for becoming the chief minister of a large state like Tamil Nadu.

‘‘రాజకీయాలలో రజనీకాంత్ కు భవిష్యత్తు లేదా..?’’

Posted: 05/19/2017 05:43 PM IST
Rajini is uneducated unsuitable for politics

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా రజనీకాంత్ ఉండాలని సూచించిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ లాంటి వారు రాజకీయాలకు పనికిరారని వ్యాఖ్యానించారు. విజ్ఞానవంతులైన తమిళ ప్రజలు అంతగా చదువుకోని రజనీకాంత్ ను తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తారని తాను భావించడం లేదని అన్నారు. విద్యాధికులు, వివేకులైన తమిళ ప్రజలు జాతీయ రాజకీయాలను స్వాగతించాలని భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత రాజకీయాల్లో చదువుకున్న వాళ్లే ఉండగలరని, అంతగా చదువుకోని వాళ్లకు తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తు వుండదని జోస్యం చెప్పారు. కాగా, ఎన్నికలకు ఇంకా చాలా దూరం వుందని, ఆ కీలక సమయం వచ్చినప్పుడు ప్రజలు ఎటువైపు వున్నారో.. వారు ఎవరినీ అదరిస్తారో వారే ఓట్లతో చెబుతారని అన్నారు. ఇక భవిష్యత్తులతో రజనీకాంత్ తో బీజేపీ పొత్తుపెట్టుకుంటే తాను వ్యతిరేకిస్తానని అన్నారు. అయినప్పటికీ ఆయనతో పొత్తు కొనసాగిస్తే, పార్టీ అధిష్ఠానం ఇష్టమన్నారు. కాగా, రజనీపై సుబ్రహ్మణ్యస్వామి ఇటీవలే విమర్శలు గుప్పించారు. రాజకీయాలకు దూరంగా రజనీకాంత్ ఉండాలని సూచించడం విదితమే.    

కాగా ఐదవ రోజు అభిమానులతో కలసి, ఫోటోలు దిగిన సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్లలపై రజనీకాంత్ ఇవాళ స్పందించారు. సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారు రాజకీయాలలో విపత్తుల లాంటి వారని అయన దుయ్యబట్టారు. దేశంలో అమలవుతున్న వ్యవస్థలోనే చాలా లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఎంతో మంది మహానుభావులు రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు సేవ చేసినా వ్యవస్థను మాత్రం మార్చలేకపోయారని అన్నారు. అందుకు వారికి కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడ్డాయని అన్నారు. అయితే వ్యవస్థలో మార్పులు, ప్రజల్లో మార్పులు వచ్చినప్పుడే సమాజం దేవాలయం అవుతుందని తెలిపారు.

ఎంకే స్టాలిన్ లాంటి ఎందరో చురుకైన రాజకీయ వేత్తలు వున్నా.. అన్భుమణి రాందాస్ లాంటి పరిపాలనాదక్ష్యులు వున్నా, ప్రతి అంశంపై లొతైన అవగాహన వున్న తిరుమవాలవన్ లాంటి నేతలు వున్నా వ్యవస్థలో మార్పుల రాకపోవడం బాధకరమన్నారు. రాజకీయాల్లోకి రావడం మంచి నిర్ణయమేనని, అయితే రాజకీయాల్లో డబ్బును సంపాదించాలని అనుకోవడం సముచిత నిర్ణయం కాదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బును అర్జించాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించనని రజనీకాంత్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Subramanian Swamy  Rajinikanth  Uneducated  pulse of fans  pulse of TN people  kollywood  Tamil Nadu  

Other Articles