varun gandhi sensational comments on modi governmentపార్టీని, ప్రభుత్వాన్ని అలోచనలో పడవేసిన ఆ యువ ఎంపీ

Varun gandhi sensational comments on modi government

varun gandhi, menaka gandhi, indore mp, uttar pradesh, central government, pm modi, bjp, amit shah, loan waiver, farmers, industralists

indore bjp mp varun gandhi makes sensational comments on modi government, says a less than one percent people enjoying huge benefits of loan waiver.

పార్టీని, ప్రభుత్వాన్ని అలోచనలో పడవేసిన ఎంపీ

Posted: 05/19/2017 08:11 PM IST
Varun gandhi sensational comments on modi government

యువతరం రాజకీయవేతలు ఎంతసేపు మార్పు, పారిశ్రామీకరణ, సాంకేతిక విప్లవం వంటి పదాలను వినియోగిస్తూ.. జీవనాడి బతకడానికి దోహదపడే తిండిగింజల ఉత్పత్తిని చేస్తున్న దేశ రైతాంగాన్ని మాత్రం మర్చిపోతుంటారు. అయితే అలాంటి వాటిని తాను పూర్తిగా భిన్నమంటూ.. కేంద్రంలో వున్న తమ ప్రభుత్వంపైనే విమర్శలను ఎక్కుపెట్టి.. అలోచింపజేసేలా వ్యాఖ్యలు సంధించారు వరుణ్ గాంధీ. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో వరుణ్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. అసలు ఆయన కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని తప్పుబట్టేంత అవసరం ఎందుకు వచ్చింది..? అంటే..

రుణమాఫీ విషయంలో ప్రభుత్వాలు వివక్షతో వ్యవహరిస్తున్నాయని వరుణ్ గాంధీ విమర్శించారు. ఓవైపు పలు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా..బడా పారిశ్రామికవేత్తలకు పెద్ద మొత్తాల్లో రుణాలు మాఫీ చేయడాన్ని వరుణ్ గాంధీ ఆక్షేపించారు. 2001 నుంచి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు రుణాలు మాఫీ కాగా వాటిలో రూ.2 లక్షల కోట్లకుపైగా 30 పారిశ్రామిక సంస్థలకే ప్రయోజనం చేకూరిందని వరుణ్ గాంధీ గుర్తు చేశారు. అయితే ఈ కాలంలో రెండు బీజేపీ ప్రభుత్వాలకు (వాజ్ పేయి - మోడీ) కూడా పాత్ర ఉండటం గమనార్హం. వరుణ్ గాంధీ మాటలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపి పార్టీని అలోచనలో పడవేసింది.

దేశ జనాభాలోని ఒక్క శాతం వ్యక్తులు 50 శాతంకు పైగా వనరులపై ఆధిపత్యం కలిగి ఉండటం న్యాయ సమ్మతం ఎలా అవుతుందని వరుణ్ గాంధీ ప్రశ్నించారు. జనాభాలో మూడోవంతుకు పైగా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని 90 లక్షల మంది చిన్నారులు శ్రామికులుగా మారి తమను తాము పోషించుకోవాల్సి వస్తున్నదని వరుణ్ అన్నారు. `ఇది న్యాయం అని మనం అనగలమా?` అని వరుణ్ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని రైతులను రుణ విముక్తుల్ని చేసేందుకు కృషి చేయనున్నట్టు వరుణ్ తెలిపారు. అయితే తాను సుల్తాన్ పూర్(ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం)కు మాత్రమే పరిమితం కానని యావత్ దేశానికి ప్రతినిధినని వరుణ్ అన్నారు.

ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల తమిళ రైతుల నిరసన గురించి వరుణ్ గాంధీ ప్రస్తావించారు. తన నియోజకవర్గంలోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు చేపట్టినట్టు వరుణ్ తెలిపారు. నాలుగువేల మంది రైతుల రుణాల కోసం రూ.22 కోట్ల నిధులు సేకరించినట్టు ఆయన తెలిపారు. తన ఎంపీ నిధుల నుంచి కూడా రూ.2 కోట్లు అందుకు కేటాయించినట్టు ఆయన తెలిపారు. భవిష్యత్ రాజకీయాలు కులం - మతం - ప్రాంతాలకు అతీతంగా ఉంటాయని..జల్ - జంగిల్ - జమీన్ - మహిళల సాధికారత నినాదాలే ప్రధాన భూమిక వహిస్తాయని వరుణ్ అన్నారు. విదేశీ పెట్టుబడులు దేశాన్ని గొప్పగా మార్చవని పేదల సంక్షేమం ద్వారానే మహాన్ భారత్ ఏర్పడుతుందని వరుణ్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun gandhi  menaka gandhi  indore mp  uttar pradesh  central government  pm modi  bjp  

Other Articles