Election Commission all set to announce EVM challenge

Election commission gets ready for evm challenge

Election Commission, EVM Challenge, EVM Live Demo, EC EVM Challenge, Tamper Proof EVM, EVM Challenge, Electoral Bonds, Electronic Voting Machines Tampering, EC AAP EVM, EVM Challenge Row, EVM Live Demo

EVM Challenge Election Commission ready for Live Demo. Modi government has proposed sale of electoral bonds in its efforts to bring transparency to election funding of political parties.

ఈవీఎంల లొల్లి.. సవాల్ కు సై

Posted: 05/20/2017 09:39 AM IST
Election commission gets ready for evm challenge

ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల సవాల్ ను స్వీకరించింది.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను పటాఫంచల్ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది.ఈవీఎంల పనితీరును నిరూపించేందుకు బహిరంగ పరీక్షకు సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ప్రకటించనున్నట్టు తెలిపింది.

మీడియా సమావేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంతోపాటు, కాగితపు స్లిప్పులపై వివరాలు నమోదయ్యే యంత్రాల గురించి కూడా ఈసీ వివరించినట్టు ఈసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. తిరిగి పాతకాలం నాటి బ్యాలెట్ విధానానికి మారిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ తాజా సవాలుకు సిద్ధమైంది.

ఇక పార్లమెంట్ ప్యానెల్ కు సమర్పించిన నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది ఈసీ. ఈవీఎంలు ట్యాంపర్ ఫ్రూఫ్ లు అని చెబుతూ, వాటి విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించింది. రాజకీయ పార్టీలకు డొనేషన్ పరిమితిని 20,000 నుంచి 2,000 వేలకు తగ్గించి పారదర్శకత పాటించాలని ఆర్థిక శాఖకు సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election Commission  EVM Tampering  Live Demo  

Other Articles