రైతులకు బేడీలేసిన మొగాడు.. అవినీతిలో మొనగాడు.. ఎవరైనా వున్నారా అంటే అది ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని బీజేపి నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన జరుగుతుందని తనకు తాను ప్రకటించికుంటున్న ప్రభుత్వం.. ధమ్ముంటే అవినీతిపై ప్రగతి భవన్లో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్దమని ప్రకటింస్తే తెలంగాణ ప్రభుత్వ అవినీతిని నిరూపించడానికి తాను కూడా సిద్దమని సవాల్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ పనులలో ఇప్పటి వరకు 2400 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. 50 కోట్ల రూపాయలుగా ఉన్న మోటార్లను.. ఎస్టిమేషన్ 90 కోట్లకు పెంచారన్న నాగం… మొత్తం 35 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయని తెలిపారు. ఆధారాలతో సహా ముఖ్యమంత్రికి లేఖ రాస్తే కనీసం స్పందించిన ఆయన తనది అవినీతి రహిత పాలన అని ఎలా ప్రకటించుకుంటారని మండిపడ్డారు. అవినీతిలో మొనగాడు కేసీఆర్ అన్న నాగం.. బీజేపీ జోలికొస్తే వస్తే ఖబర్దార్… అంటూ హెచ్చరించారు. కేసీఆర్పై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలిగి పోతున్నాయని… రైతులకు భేడీలు వేసిన మొగోడివి నువ్వే అంటూ విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జర్రుగుతోందని.. గతంలో ఈడీ, విజిలెన్స్ , సీవీసీకి ఫిర్యాదు చేసినట్లు నాగం పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్… అమిత్ షాను అవమానిస్తాడా.. కేసీఆర్ అవినీతే… తెలంగాణ ప్రగతికి అడ్డంకి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది తప్పైతే తనమీద కేస్ పెట్టి జైలుకు పంపాలని సవాల్ విసిరిన నాగం… లేదంటే.. కేసీఆర్ స్థానం ఎక్కడో… తానే చూపిస్తానని వ్యాఖ్యానించారు.
ఐసిస్ ఉగ్రవాదులకు గులాబీ పూలు ఇచ్చి.. రైతులకు మాత్రం బేడీలు వేయడం కేసీఆర్ విధానమంటూ విరుచుకుపడ్డారు నాగం. రైతులకు కేంద్రం నుంచి 700కోట్లు ఇస్తే… ఎక్కడ ఖర్చు చెశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ నీచాతినీచంగా దిగజారాడని విమర్శించారు. మళ్లీ నేనే సీఎం అనే భ్రమలోంచి కేసీఆర్ బయటకు రావాలని ఆయన సూచించారు. కేసీఆర్ కేరాఫ్ అడ్రెస్ అన్నాడీఎంకే నేత శశికళ ఉన్న చోటే అన్న నమ్మకం తనకు ఉందని ఉద్ఘాటించారు. అమిత్ షా నాయకత్వంలో… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more