ఆయన ఒక పోలిస్ స్టేషన్ అధికారి. ఆ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు తన విధులు కల్పించాయి. అయితే తన విధులు నిర్వహిస్తున్న ప్రాంతానికి.. నివాసం వుంటున్న ప్రాంతానికి తేడా వుందనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఏకంగా ఇంట్లో మాత్రం శాడిస్టుగా మారాడు. అంతేకాదు తన భార్య విడాకులు ఇవ్వమని నిత్యం పోరు పెడుతున్నారు. అంతటితో అగకుండా తనకు వెంటనే విడాకులు ఇవ్వకపోతే తమ రహస్య వీడియోలను అంతర్జాలంలో పెడతానని కూడా భరితెగించి మరీ హెచ్చరించాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే.. మరో పెళ్లి చేసుకుంటే కోట్ల రూపాయల కట్నం వస్తుందనే.
ఇంతకీ ఆయన ఎవరు అంటారా..? సంగారెడ్డి ఎస్సై పెద్దోళ్ల లక్ష్మారెడ్డి. అతని భార్య జ్యోతి పిర్యాదుతో మల్కాజ్గిరి పోలీసులకు లక్ష్మారెడ్డిని అరెస్టు చేశారు. వసంతపురికాలనీకి చెందిన కె.జ్యోతిరెడ్డికి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గాజులగూడేనికి చెందిన లక్ష్మారెడ్డితో 2013లో వివాహమైంది. ప్రసుత్తం లక్ష్మారెడ్డి సంగారెడ్డి టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో ఆరు లక్షల నగదు, 40 తులాల బంగారం కట్నకానుకల కింద అందజేశారు. వీరికి రెండున్నరేళ్ల బాబు సృజన్‌రెడ్డి ఉన్నాడు. లక్ష్మారెడ్డి అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో ఆమె మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్థానిక పోలీసులకు భార్య జ్యోతి మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో.. అమె ఏకంగా ఉన్నతాధికారులను కలసింది. ఉన్నతాధికారులు అదేశించడంతో కదిలిన స్థానిక పోలీసులు లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని భార్య జ్యోతి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తకు డబ్బు, అమ్మాయిల పిచ్చి వుందని అరోపించింది. తన ముందే లేడీ కానిస్టేబుళ్లతో, పోలీస్ స్టేషన్ సమస్యలతో వెళ్లే మహిళలతో సరసాలు ఆడతాడని ఆరోపించింది. అంతేకాదు.. తనపై అనుమానంతో ఇంటినిండా సీసీ కెమెరాలు బిగించాడని వాపోయింది. మరో పెళ్లి… కట్నం కోసం పాకులాడుతూ విడాకులివ్వాలని వేధిస్తున్నాడని,… లేకపోతే బెడ్రూం వీడియోలు వెబ్సైట్లకు అప్లోడ్ చేస్తానంటున్నాడని ఫిర్యాదు చేసింది. భర్త అయిన సంగారెడ్డి ఎస్సై లక్ష్మారెడ్డి చేష్టలకు సంబంధించి తన వద్ద సీడీలతో సహా ఆధారాలు ఉన్నాయని చెబుతోంది బాధితురాలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more