ఎందరో మహానుభావులు స్వాతంత్ర్యానికి ముందు నుంచి కొనసాగుతున్న మూడాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. అందులో చెప్పుకోదగినది సతీ సహగమనం. ఇప్పటికీ దీని గురించి తెలుసుకుని దానితో పాటు ఇలాంటి సాంఘిక దురాచారాలకు రేపటి తరం దూరంగా వుండాలని మన ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో ఈ అంశాలను జోడించాయి. అయితే స్వతంత్ర్య దేశంలో అందునా దేశానికి స్వతంత్రం వచ్చి సుమారు 67 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మాత్రం కొత్త, వింత, దురాచారాలు రాజ్యమేలుతున్నాయి.
మరోలా చెప్పాలంటే అంతకు మించిన ఘోరం తెలంగాణలో చోటుచేసుకుంది. తమకొడుకు అకస్మికంగా మరణించాడని ఏకంగా తమ కోడలి పైన పూర్తి హక్కులు తమవే నంటూ కొడలిని అమ్మిన దారుణ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కిష్టాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. కొడలిని తమ ఇ:టిలో వస్తువుగా పరిగణించే అత్తమామలు తమ కొడుకు చనిపోయాడని అమెను విక్రయించేశారు.
వీరిదే దారుణమని భావిస్తుండగా, వారి కోడలును ఏకంగా గుజరాత్ కు చెందిన ఒక వ్యాపారవేత్త కొని తీసుకెళ్లడు. అయితే ఇందుకుగాను లలిత అత్తమామలకు రూ.1.80 లక్షల రూపాయలను చెల్లించాడు. తనను కట్టి బానిస కన్నా దారుణంగా వ్యాపారి వేధింపులకు గురిచేస్తుండటంతో అమె తన సోదరుడికి విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపింది. దీంతో లలిత తల్లిదండ్రులు, సోదరుడు విచారించగా అత్తమామలు నోరు విప్పడం లేదు.
దీంతో వారు స్థానిక పోలిస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని మొత్తం ఎస్ ఐ వెంకన్నకు వివరించి.. పిర్యాదు చేశారు. లలితకు రెండేళ్ల పాప ఉందని తల్లి కోసం అమె ఏడుస్తున్నా అత్తమామలు పట్టించుకోలేదని తెలిపారు. అయితే ప్రస్తుతం. ఆ పాప అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. ఆ పాపతో పోలీస్ స్టేషన్ కి వచ్చిన లలిత కుటుంబ సభ్యులు తమ కూతురి ఆచూకీ తెలపాలని కోరారు. తమ కూతురు ఎవరో వ్యాపారి చేతిలో వేధింపులకు గురవుతోందని, ఆమెను కాపాడాలని వేడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more