కాంగ్రెస్ అధినాయకత్వం వద్ద దగ్గర తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావుకు అంత పలుకుబడి ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెబుతారు..? సమాధానం విషయమేమో కానీ..అయన పార్టీకి విధేయుడు అని మాత్రం చెబుతారు ఎవరైనా. అయన విధేయత ఎలాంటిది అంటే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో కలసి ఓసారి బోటులో పర్యటిస్తుండగా, నా గురించి ఏమైనా చేస్తామని అంటారు కదా..? మరి ఈ నదిలో దూకగలరా..? అని ప్రశ్నించారట. అంతే ముందు వెనుక అలోచించకుండా ఉన్నఫలంగా నదిలోకి దూకాడట వీహెచ్. అలా రాజీవ్ గాంధీకి అప్పటి సమైక్య తెలుగు రాష్ట్రం నుంచి ప్రియమైన శిష్యుడిగా మారాడు.
ఇక తాజాగా రాజీవ్ గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వీహెచ్ ను సరదాగా ఓ మాట అన్నారు. దాని పరిణమమే తాజాగా ఆయన విధేయతను, కాంగ్రెస్ పార్టీ కట్టప్పను మళ్లి వార్తల్లోని వ్యక్తిగా మార్చేసింది. ఇప్పటికే గాంధీల కుటుంబానికి తాను విధేయుడినన్న విషయాన్ని నిత్యం అంగీకరిస్తు ముందుకు సాగుతున్న వీహెచ్.. అధినేత మాటను అస్సలు జవధాటని కట్టప్పగా మార్చింది. అందుకు ఆయన మాటలకు పరిమితం కాకుండా చేతల్లో కూడా చేసి చూపుతారు.
తాజాగా సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాగర్జన సభ సందర్భంగా.. ఈ భారీ సభను సింగిల్ హ్యాండ్ తో టేకప్ చేసి సక్సెస్ చేసిన క్రెడిట్ జగ్గారెడ్డిదే అంటూ.. రాహుల్కు పరిచయం చేశారు వీహెచ్. సభ కోసం కోట్ల రూపాయిల్ని ఖర్చు చేశారని గొప్పగా చెప్పారు. దీనికి స్పందించిన వీహెచ్.. మరి మీరేం చేశారని అడగటం.. దానికి సమాధానంగా వీహెచ్.. నా దగ్గర ఏముందని ఇవ్వటానికంటూ బదులివ్వటం.. చేతికి ఉన్న బ్రాస్
లెట్ ను చూపించి.. ఇది ఇవ్వొచ్చు అని సెటైర్ వేయడం తెలిసిందే. ఇదే విషయం మీడియాలో వైరల్ అయ్యింది. .
ఏం అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా వీహెచ్ రియాక్ట్ అయ్యారు. తన చేతికున్న బంగారు బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డికి ఇచ్చేశారు వీహెచ్. రాహుల్ సరదాగా అన్నప్పటికీ వీహెచ్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం గమనార్హంమొత్తానికి తన బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డికి ఇచ్చేయటం ద్వారా గాంధీ ఫ్యామిలీకి తాను రియల్ కట్టప్ప అన్న విషయాన్ని వీహెచ్ చెప్పకనే మరోమారు చాటిచెప్పారు. దీంతో కొందరు అప్పుడు తండ్రి చెంత విధేయుడిగా వున్న వీహెచ్.. ఇక తనయుడు వద్ద కూడా అదే విధేయతను చాటుకున్నారని పలువురు చమత్కరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more