ప్రభుత్వ అసుపత్రి వర్గాలు అమానుషం ఇందుగలదు అందు లేదు అన్న సందేహము వలదు అన్నట్లు ఏ రాష్ట్రం చూసినా.. ఏ జిల్లా చూసినా అందందు స్పష్టంగా కనిపిస్తుందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఒడిశాలోని ఓ గిరిజనుడు తన భార్య శవాన్ని బస్సులోంచి దించివేస్తే.. తన భుజాన వేసుకుని తన గూడేనికి తీసుకెళ్లిన ఘటన నమోదైన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది పేదలు ప్రైవేటు వాహనాలకు డబ్బులు చెల్లించే స్తోమత లేక తమకు అందుబాటులో వున్న మార్గాల ద్వారా శవాలను తీసుకువెళ్తు వార్తల్లో నిలుస్తున్నారు.
పేదలకు మార్చూరీ వాహనాలను అందించేందుక అస్పత్రి వర్గాలు నిరాకరించి.. అందుకుగాను చివరకు రకరకాల కథలు చెబుతూ.. ఆ కల్పిత కథలనే అసలైన కారణాలుగా నిజం చేస్తున్నారు. తాజాగా బీహర్ లో కూడా ఇలాంటి ఘటనే నమోదైంది. అస్పత్రి వర్గాలు అమానుషంగా వ్యవహరించి మార్చూరి వ్యాన్ ను ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ భర్త తన భార్య మృత దేహాన్ని బైక్ పై ఇంటికి తరలించాడు. భీహార్ లోని పూర్ణియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జిల్లాలోని రణిబరి గ్రామానికి చెందిన శంకర్ షా (60), సుశీల దేవి (50) భార్యాభర్తలు. ఇటీవల అనారోగ్యం కారణంగా పుర్ణియా సదర్ ఆసుపత్రిలో చేరిన సుశీల.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోయింది.
దీంతో తన కుమారిడికి బైక్ తీసుకురమ్మని ఫోన్ చేసి.. అదే బైక్ మధ్యలో తల్లి మృతదేహాన్ని పెట్టి వెనక తండ్రి కూర్చోగా ఇంటికి తరలించారు. ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా అంబులెన్స్ ఇవ్వలేదని, ప్రైవేటు వాహనం డ్రైవర్ రూ.1500 అడిగాడని శంకర్ వివరించాడు. ఇది చాలా బాధాకరమైన విషయమని, ఆసుపత్రిలో ఒకే ఒక్క మార్చురీ వ్యాన్ ఉందని, ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదని సర్దార్ ఆసుపత్రి సివిల్ సర్జన్ వాసిమ్ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ కుమార్ పాల్ విచారణకు ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more