Al-Qaeda Operative Calls Indian Muslims are Shameless

Zakir musa slams indian muslims for not joining jihad

Al-Qaeda Operative, Zakir Musa, Zakir Musa Indian Muslims, Indian Muslims Shameless, Shameless Muslims India, Al-Qaeda India, Zakir Musa Audio Message, Zakir Musa Cow Vigilant

Al-Qaeda Operative slams Indian Muslims for not joining jihad. World Most Shameless Persons. Zakir Musa, former Hizbul commander calls on Muslims to launch Jihad against cow vigilantes

ఇండియన్ ముస్లింలు.. జిహాద్ కు టైమొచ్చింది

Posted: 06/06/2017 08:39 AM IST
Zakir musa slams indian muslims for not joining jihad

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్ లోని ముస్లింలను రెచ్చగొట్టే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా హిజ్బుల్ ముజాహుద్దీన్ మాజీ కమాండర్ జకీర్ మూసా పరుష వ్యాఖ్యలు చేశాడు. భారత్ ముస్లింలకు అసలు సిగ్గు ఉందా? అంటూ విరుచుకుపడ్డాడు. జకీర్ ఈ మధ్యే అల్ ఖైదాలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందులో కీలక బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తన సందేశాన్ని విడుదల చేయగా, అది సంచలనంగా మారింది.

ఇస్లామిక్ జిహాద్‌లో చేరని భారతీయ ముస్లింలు, సిగ్గుచేటంటూ అని అందులో వ్యాఖ్యానించాడు. కశ్మీర్‌లో ఇటీవల జరుగుతున్న ఘటనలను వేధింపులుగానే పేర్కొన్న మూసా.. యుద్ధం ఒక్క కశ్మీర్‌కే పరిమితం కాలేదని, ఇది ఇస్లాంకు, నాస్తికత్వానికి మధ్య పోరని చెబుతున్నాడు. మూసా తొలి సందేశమైన ఈ ఆడియో టేప్ ప్రస్తుతం ‘టెలిగ్రామ్’, ‘వాట్సాప్’ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. కాగా, మూసా విడుదల చేసిన టేప్‌లో అల్‌ఖాయిదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ చిత్రాలు, ఇంగ్లిష్, ఉర్దూలో ఉన్న ఇస్లామిక్ కోట్స్ కనిపించాయి.ఆడియో టేపులోని గొంతు మూసాదేనని భారత అధికారులు ధ్రువీకరించారు.

బిజ్నోర్ రైలులో ఓ ముస్లిం మహిళపై ఓ పోలీస్ కానిస్టేబుల్ అత్యాచారం, గోరక్షకులు ముస్లింలపై తెగబడుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికైనా భారత ముస్లింలు జిహాద్ లో చేరకపోవడం సిగ్గు చేటన్నాడు. ముస్లింలుగా చెప్పుకునేందుకు వారు సిగ్గుపడాలన్నాడు. మన అక్కాచెల్లెళ్లు దాడులకు గురవుతున్నా, వారిని బాధిస్తున్నా భారతీయ ముస్లింలు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం దారుణమని తెలిపాడు. ‘ఇస్లాం అంటే శాంతి’అని చెప్పడానికి సిగ్గుపడాలని మూసా తీవ్రస్థాయిలో పేర్కొన్నాడు. తమ అనుచరులుగా వ్యవహరిస్తూ కీలక నేతల హత్యలో భాగస్వాములైన నమ్మక ద్రోహులను మట్టుబెట్టి తీరతానని శపథం చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Al-Qaeda  Zakir Musa  Indian Muslims  

Other Articles