బ్యాంకులు తమ అసలు ఉద్దేశానికి స్వస్తి పలికి అదాయ ఆర్జన కోసం కొత్త తరహా బాదుడు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. దేశంలో ఇక నగదు రహిత లావాదేవీలే జరగాలని.. అందుకోసం అనేక విప్లవాత్మక మార్పులతో చర్యలు చేపడుతున్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బ్యాంకు తమ కస్టమర్లపై కొత్తరకం ఛార్జీలను వడ్డించనున్నాయి. మీ మొబైల్ లో మీ బ్యాంకు యాప్ తో పాటు పలు వాలెట్ ల నుంచి మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారా..? ఇన్నాళ్లు ఉచితంగా మొబైల్ యాప్ నుంచి బ్యాంక్ ఖాతా సేవలను వినియోగించుకున్న కస్టమర్లు.. జాగ్రత్తా సుమా ఇకపై ఇలాంటి మనీ ట్రన్స్ ఫర్ సేవలకు చార్జీలు పడనున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే పీర్-టూ-పీర్ పేమెంట్లకు(మొబైల్ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులు)లకు కూడా బ్యాంకులు ఛార్జీలను వడ్డించనున్నాయి.
యూపీఐ లావాదేవీలపై కొత్త ఫీజుల విధింపు, అలాగే ఫండ్స్ ట్రాన్సఫర్ చేసేటప్పుడు విధించే చార్జులను కస్టమర్లకు సవివరంగా వివరిస్తూ.. ఇప్పటికే మెసేజ్ లను పంపింది. వచ్చే నెల పది తేదీ నుంచి తమ చార్జీలు ప్రారంభమవుతాయని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన భ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అప్ ఇండియా కూడా ఇదే విధంగా చార్జీలను వడ్డించనుంది. ఈ నేపథ్యంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్ డీ ఎఫ్ సీ కూడా జూలై 10 నుంచి వీటిని అమల్లోకి తేవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా వచ్చే రెండు మూడు నెలల్లో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వేయనున్నట్టు తమ వెబ్ సైట్లో పోందుపర్చింది.
మొబైట్ లావాదేవీలపై హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు వేసే ఛార్జీలు 25వేల రూపాయలకు లోపు లావాదేవీలకు మూడు రూపాయలు దాంతో పాటు పన్నులు ఉంటాయి. 25వేలకు పైనుంచి లక్ష లోపు లావాదేవీలకు ఐదు రూపాయల ఛార్జీ, ప్లస్ పన్నులు ఉంటాయని తెలిసింది. ఇక అంతకన్నా అధికంగా జరిపూ లావాదేవీలకు ఎంత మేర చార్జీలు, పన్నులు విధిస్తారన్న విషయం మాత్రం పొందుపర్చలేదు. ఇక భారతీయ స్టేట్ బ్యాంకు మాత్రం లక్ష లోపు లావాదేవీలకు ఒక్క రూపాయి.. లక్ష నుంచి రెండు లక్షల మధ్య లావాదేవీలకు 15 రూపాయలు, రెండు నుంచి ఐదు లక్షల లోపు లావాదేవీలకు 25 రూపాయల చార్జీలు విధించనుంది.
లావాదేవీలు మొబైల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా రెండు బ్యాంకు అకౌంట్లు తక్షణమే ఫండ్స్ ట్రాన్సఫర్ చేసుకోవడానికి యూపీఐ పేమెంట్ సిస్టమ్ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీసుకొచ్చింది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ట్రాన్సఫర్లకు దీన్ని వాడుతున్నారు. అయితే యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు వేయొద్దని ఎన్పీసీఐ బ్యాంకులను కోరుతోంది. కాగా, ఈ నిర్ణయంపై అటు కస్టమర్లు కూడా అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చేతిలో రెండు లక్షల రూపాయల కన్నా అధికంగా వుండకూడదని చెబుతున్న కేంద్రం.. అది నేరం కింద వస్తుందని, అందుకు జరిమానాలు కూడా విధిస్తామని చెప్పడంతో. ఇటు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరపే వీలు లేక.. అటు నగదుతో జరిపూ అవకాశంలో.. కస్టమర్లు దిక్కుతోచని అగమ్యగోచర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ప్రజల సోమ్మును దోచుకునే బ్యాంకుల ప్రయత్నాలను ఇప్పటికైనా స్వస్తి పలకాలని కస్టమర్లు కేంద్రంతో పాటు రిజర్వు బ్యాంకును అర్థస్తున్నారు. మరి కేంద్రం దీనిపై ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటుందో.. లేక కేంద్రం అనుమతితోనే ఈ చార్జీల మోత మోగుతుందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more