నాట్యం చేయడం కోసం నెమలి కూడా మద్యం తాగుతుందా..? ఈ ప్రశ్న ఇప్పుడు ఈ వీడియో చూసిన వారి మదిని తొలుస్తుంది. ఎందుకంటారా..? ఏకంగా వైన్ స్టోర్ లోకి వెళ్లిన ఈ నెమలి మద్యం తాగేదాక బయటకు వెళ్లనన్నట్లు షాపులోనే కూర్చోని ఏకంగా వేల ఖరీదు చేసే మద్యం బాటిళ్లను పగులగొట్టింది. ఇక దానిని పట్టుకునేందుకు వచ్చిన జూ అధికారులను కూడా చాలా శ్రమపెట్టింది. ఈ నెమలి వైన్ స్టోర్ లో చేసిన హల్ చల్ ఇప్పుడు నెల్ లో వైరల్ గా మారింది.
అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ పరిధిలోని అర్కేడియాలో గల రాయల్ ఓక్స్ లిక్కర్ స్టోర్ లోకి ఉదయాన్నే నెమలి వచ్చింది. ఇలా ఉదయాన్నే అనుకోని అథిధి రావడంతో బిత్తరపోయిన వైన్ స్టోర్ యజమాని.. వెంటనే జూ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే స్టోర్ లోపల తిష్టవేసిన నెమలి.. జూ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు దాదాపు రూ.30 వేల ఖరీదైన మద్యం సీసాలను పగులకొట్టేసింది.
ఇక నెమలిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన జూ సిబ్బందిని కూడా చాలా శ్రమింపజేసింది. వారు దానిన పట్టుకునే క్రమంలో మరెన్నో మద్యం సిసాలను కూడా నెమలి కిందపడేసింది. ఎట్టకేలకు జూ అధికారులు దానిని పట్టుకుని తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి జూ అధికారులు మాట్లాడుతూ ఆ నెమలి అడవి నుంచి తప్పిపోయి ఆర్కాడియా ప్రాంతంలో ఉన్న రాయల్ ఓక్ లిక్కర్ దుకాణానికి వెళ్లిందని, అది అక్కడి కస్టమర్లపైకి కూడా దూకుతూ వారు బెదిరిపోయేలా చేసిందని చెప్పారు. ఈ నెమలిని పట్టుకునేటప్పుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more