మెట్రో రైలులో ఓ ప్రయాణికుడు అదే రైలులోని బాత్రూమ్ లో నటుడు చేసిన పనితో షాక్ అయ్యాడు. అంతటితో అగకుండా అధికారులకు నటుడి అనుమానాస్పద వ్యాఖ్యలపై అధికారులకు పిర్యాదు చేయడంతో ఫ్రాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీ, ఆయుధాలు అంటూ బాత్రూమ్లో మాట్లాడిన నటుడిని ఉగ్రవాదిగా భావించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడు నటుడని, మూవీ డైలాగ్ ప్రాక్టీస్‌లో భాగంగా కొన్ని పదాలు వాడినట్లు తెలుసుకుని విచారణ అనంతరం వదిలేశారు. అసలే 2015 నవంబర్‌లో జరిగిన మారణహోమాన్ని ఫ్రాన్స్ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... ఓ హాలీవుడ్ చిత్రంలో ఫ్రాన్స్ కి చెందిన నటుడు తాను నటించబోయే ఇంగ్లిష్ సినిమా కోసం మెట్రోరైలులోని ఒక బోగీ బాత్రూంలో కూర్చుని డైలాగులు వల్లేవేసుకుంటున్నాడు, ఆ డైలాగుల్లో వెపన్, గన్ వంటి ఆంగ్ల పదాలు కూడా వున్నాయి. అదే సమయంలో టాయ్ లెట్ కని వెళ్లిన మరో ప్రయాణికుడు వాటిని విన్నాడు. వెంటనే రైలు అధికారులను అప్రమత్తం చేసేందుకు సైరన్ మోగించాడు. అనుమానాస్పద వ్యక్తి ఎవరితోనో బాత్రూంలో ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడని పోలీసులకు సమాచారం అందించాడు.
దీంతో ఉగ్రదాడి జరుగుతుందోమోనని భావించిన భద్రతా సిబ్బంది ప్యారిస్ లో హై అలర్ట్ ప్రకటించిన అనంతరం ఆర్టిస్ట్ ను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. హాస్యనటుడిగా ప్రాచూర్యం పోందిన నటుడు హాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడని అందులో భాగంగానే డైలాగ్స్ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. రైలు బోగీలో డైలాగ్స్ గట్టిగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని ఈ పని చేశానని వివరణ ఇచ్చాడు.
దీంతో అతను చెప్పేది నిజమని నిర్ధారించుకున్న పోలీసులు, చివరికి అతనిని విడిచిపెట్టారు. కాగా, 2015 నవంబర్ లో ఐసిస్ ఉగ్రదాడులు పేట్రోగిపోవడంతో జరిగిన పారిస్ ఉగ్రదాడుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండేళ్ల లోపే మరో ఉగ్రదాడి జరుగుతుందని భావించి రంగంలోకి దిగిన పోలీసులు.. వేగంగా స్పందించి నటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు ఫ్రాన్సు వాసులకు కూడా విషయాన్ని చెప్పారు. అతడు ఉగ్రవాది కాదని, నటుడని.. ఆందోళన అక్కర్లేదని పోలీసులు మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more