New Rs 500 note introduced, old notes will stay valid కొత్త రూ.500 నోటును నకిలీవనుకునేరు సుమా..!

Rbi issues new rs 500 notes with inset letter a old notes to stay valid

new security features, new security features in rs 500 note, security code a in rs 500 note, rbi introduces new rs 500 note, reserve bank of india, RBI Issue New Notes, New Rs 500 Note, New Currency, demonetization

The Reserve Bank of India issued a new batch of banknotes of Rs 500 denomination with inset letter ‘A’ in both the number panels. The Rs 500 notes issued post-demonetisation will remain valid.

నకిలీ కాదు గురూ.. కొత్త రూ.500 నోటు వచ్చేసింది..

Posted: 06/13/2017 12:43 PM IST
Rbi issues new rs 500 notes with inset letter a old notes to stay valid

భారతీయ రిజర్వు బ్యాంకు ఇవాళ మరో కొత్త నోటును విడుదల చేసింది. ఐదు వందల రూపాయల డినామినేషన్ లో మాత్రమే ఈ కొత్త నోటును అర్బీఐ ఇవాళ విడుదల చేసింది. అచ్చంగా నోట్ల రద్దు తరువాత విడుదల చేసిన ఐదు వందల రూపాయల నోటు మాదరిగానే వున్న ఈ నోటు.. కొన్ని భద్రతాపరమైన ఫీచర్స్ కలిగివుందని అర్బీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500 నోట్లకు కొన్ని ఫీచర్లు జోడించి కొత్త నోటును విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ అధికారులు ప్రకటించారు.

ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లకు మరింత భద్రతాపరమైన అంశాలను జోడించి.. కొత్తవాటిని ముద్రించామని వాటిని ఇవాళ మార్కెట్ లోకి వి విడుదల చేసినట్లు రిజర్వు బ్యాంకు వెల్లడించింది. కొత్త నోటుపై 'ఏ' అనే అక్షరాన్ని జోడించామని పేర్కొంది. నోటుకు రెండు వైపులా ఈ ‘ఎ’ అనే అక్షరం నెంబరు ప్యానెల్ పై వుంటుందని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం చెలామాణిలో వున్న రూ. 500 నోట్లు కూడా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. నకిలీ నోట్లను అరికట్టేందుకే అదనపు సెక్యూరిటీ ఫీచర్‌ను జోడించామని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.

దేశంలోని అవినీతిపై పోరాడి, నల్లధనాన్ని వెలికితీయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు మన కరెన్సీని వినియోగించడాన్ని అడ్డుకోవడంతో పాటు.. దేశంలోని అంతర్గత తీవ్రవాదాన్ని కూడ దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం గత నవంబర్ 8న నోట్లరద్దు నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం అనుకున్నంత ఫలితాలు మాత్రం నోట్ల రద్దుతో రాలేదన్న విమర్శల నేపథ్యంలో దానిని నగదు రహిత సమాజం నినాదాన్ని జోడింది.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో తొలుత విడుదల చేసిన నోట్లలో భద్రతా ప్రమాణాలు తక్కువగా వున్నాయని విమర్శలు రావడంతో ఐదు వందల రూపాయల నోటులో మరిన్న భద్రతా ప్రమాణాలను పొందుపర్చి ఇవాళ విడుదల చేశారు. అయితే వీటిని విరివిగా ప్రచారం చేయాల్సిన అవసరం వుంది. ఇప్పటికే పది రూపాయల నాణేలపై జరుగుతున్న విష ప్రచారంతో అనేక మంది పది రూపాయాల నాణేలాను తీసుకునేందుకు కూడా తిరస్కరిస్తున్నారు. అదే మాదిరిగా ఈ నోట్లలోనూ విషప్రచారం జరగకుండా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles