Firefighters battle inferno in West London Tower

Blaze engulfs apartment block in west london

London fire, London Fire Accident, London Accident, West London Tower, Grenfell Tower, Grenfell Tower Fire, Apartment Fie Accident, Death Toll London Fire, White City, Death Toll Grenfell Tower

A residential tower in west London is feared to be on the verge of collapse as a massive fire continues to burn through the building.27-storey Grenfell Tower Caught Fire 40 fire engines and 200 firefighters had been called to the scene early on Wednesday morning.

ఘోరం.. వందల మంది సజీవ దహనం?

Posted: 06/14/2017 10:51 AM IST
Blaze engulfs apartment block in west london

లండన్ లో ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటిదాకా అధికారికంగా మృతుల సంఖ్య వెలువరించలేదు. వైట్ సిటీ లోని 27 అంతస్తుల గ్రెన్‌ ఫెల్‌ టవర్‌ మొత్తం అగ్నికి ఆహుతికాగా, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎగసి పడుతున్న మంటలు అదుపులోకి రాకపోగా, పక్కనున్న భవనాలకు కూడా వ్యాపించాయి. సుమారు 40 ఫైరింజన్లు, 200 మంది ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.

గత అర్థరాత్రి 1.16 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగగా, 1974లో నిర్మించిన టవర్ లోని 120 ఫ్లాట్‌ లన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో అత్యధికులు నిద్రిస్తుండటంతో, మృతుల సంఖ్య వందల్లోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత 200 మంది వరకూ ఈ ప్రమాదంలో చిక్కుకుని ఉంటారని అంచనా వేసినప్పటికీ, మంటల్లో సజీవదహనమైన వారి సంఖ్య అంతకు మించే ఉంటుందని తెలుస్తోంది.

తమ కళ్ల ముందే ఎంతో మంది కాలి బూడిదై పోయారని, ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికీ కొన్ని ఫ్లాట్ల నుంచి సహాయం కోసం ప్రజల హాహాకారాలు వినిపిస్తుండగా, వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు.

ఫోటోల కోసం క్లిక్ చేయండి

 

యజమాని నిర్లక్ష్యం...

ఈ భవనానం లోపలికి రాకపోకలు సాగించేందుకు ఒకే మార్గం ఉందని, ఈ విషయమై ఏడాది క్రితం హెచ్చరించినా, అపార్ట్ మెంట్ యాజమాన్యం పట్టించుకోలేదని అధికారులు వెల్లడించారు. రాకపోకలకు ఒకే మార్గం ఉండటం ఆ మార్గంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో ఎవరూ బయటకు రాలేక పోయినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : London  Fire Accident  Grenfell Tower  

Other Articles