After KK Now DS Name in Land Scam

Trs mp names in land scams

TRS MP D Srinivas, DS Land Scam, TRS MP K Kesava Rao, TRS MP D Srinivas, DS KCR, KCR KK DS, KK and DS, KK Land Scam, KK Gold Stone Lands, DS Land Grabbing, TRS MPs Land Scam

TRS MP D Srinivas Name in Land Scam. Rajyasabha Member aid acquired Lands of Poor, 4 Acres on DS Name.

కేసీఆర్ కు పెద్దల ట్రబుల్స్

Posted: 06/14/2017 12:26 PM IST
Trs mp names in land scams

భూ అక్రమార్కుల దందాలు తెలంగాణ సర్కార్ ను ఇరకాటంలో నెట్టేస్తున్నాయి. మొన్న మధ్యే టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కే కేశవరావు కుటుంబ సభ్యుల పేర్లు మియాపూర్ స్కాంలో వినిపించగా, ఆయన వాటిని ఖండించిన విషయం తెలిసిందే. అన్ని పద్ధతి ప్రకారమే తాము చేసుకుపోయామని చెబుతున్నప్పటికీ అధికారుల అండతోనే ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని టీడీపీ సహా వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇంతలోనే భూ స్కాంలో మరో కీలక నేత హస్తం వెలుగు చూసింది.

భూ కుంభకోణం ఆరోపణల్లో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పేరు బయటపడింది. మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలో గౌడవెల్లి-రాయిలాపూర్ రోడ్డులో సర్వే నంబర్ 221 లో 8.9 ఎకరాలు భూమి ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ భూమిని నిరుపేద ముదిరాజ్ కులస్థులకు కేటాయించారు. వాటిని 1972-73లో ఈ భూమిని ముదిరాజ్ ల నుంచి బొక్క యాదిరెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు.

యాదిరెడ్డి కుమారులు సాయిరెడ్డి, బల్వంత్ రెడ్డి, రఘుపతి రెడ్డిల నుంచి ఈ భూమిని 2015 డీఎస్, ఆయన అనుచరుడు ఎ.వి.సత్యనారాయణలు కొనుగోలు చేశారు. ఇందులో 4 ఎకరాలు డీఎస్ పేరిట (డాక్యుమెంట్ నంబర్ 4873/15) ఉంది. 2015లో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దీని రిజిస్ట్రేషన్ జరిగింది.

ఈ ఏడాది జనవరిలో మ్యుటేషన్ కోసం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వీరు దరఖాస్తు చేసుకున్నారు. భూమిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. నిరుపేదల కోసం ఇచ్చిన అసైన్డ్ భూమిని అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వార్త ఇప్పుడు రాజకీయావర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  MP D Srinivas  Land Scam  

Other Articles