MP Diwakar Rreddy Flies to Paris after Airport Rucks

Where is mp jc diwak reddy

Telugu Desam Party MP, TDP JC Diwakar Reddy, MP JC AIrport, MP JC France, MP Diwakar Reddy, JC Diwakar Reddy France Tour, MP Diwakar Reddy Arrest, MP Diwakar Reddy Probe, Civil Aviation MP Diwakar Reddy

After creating a ruckus at the Vizag airport, Telugu Desam Party MP Diwakar Reddy has flown out of the country. He is expected to stay in France for six days.

ఆ ఎంపీ ఎలా మాయం అయ్యాడు?

Posted: 06/17/2017 11:27 AM IST
Where is mp jc diwak reddy

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో రచ్చ చేసి ప్రింటర్ పగలగొట్టి సిబ్బందితో అనుచితంగా వ్యవహరించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై బ్యాన్ వేశాయి విమానయాన సంస్థలు. తన వ్యవహారశైలితో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న ఆయనపై పార్టీ తరపున కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతుండటంతో చంద్రబాబు కూడా రంగంలోకి దిగారు.

పైగా క్షమాపణలు కూడా చెప్పేందుకు జేసీ నిరాకరించటంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఆయన్ను విదేశాలకు ఎగిరిపోయారన్న వార్త అగ్నికి మరింత ఆజ్యం పోసింది. జేసీ కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినట్టు ఓ జాతీయ మీడియా కథనం రాసింది. మరో ఆరు రోజులపాటు పారిస్ లోనే ఆయన రెస్ట్ తీసుకుంటారని తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఆయన సిబ్బంది మాత్రం రహస్యంగా ఉంచుతున్నారని చెప్పింది. మరోవైపు జేసీ ఇంట్లోనే రెస్టు తీసుకుంటున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఎవరైనా సందర్శనకు వస్తే...తలనొప్పితో పడుకున్నారని, తరువాత రావాలని చెప్పారని సమాధానం చెబుతున్నారు.

ఆయన విదేశాలకు వెళ్లారా? అని అడుగగా... తమకు మాత్రం తెలియదని చెబుతున్నారు. తమపని ఆయన ఏం చెప్పమంటే అది చెప్పడమేనని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వైజాగ్ లో గొడవ అయ్యాక కూడా ఆయన హైదరాబాద్ కు ఇండిగో ఫ్లైట్ లోనే వచ్చాడు. దీంతో ఆ విషయంలో ఆయనకు సాయం చేసిందెవరో తెలుసుకునేందుకు పౌరవిమాయాన శాఖ విచారణకు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP Diwakar Reddy  Airport Rucks  Flown to France  

Other Articles