గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు రోడ్డు. ఆదివారం ఉదయం సరిగ్గా 10 గంటలు అవుతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ మహిళ ఓ చేతిలో పురుగుల మందు, మరో చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకుని కూర్చుంది. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు మెల్లిగా పోలీసులకు సమాచారం అందించారు. అది పసిగట్టి వెంటనే మొదటి దాన్ని గబాళున తాగేసింది. ఇక స్థానికులు 108 కి సమాచారం అందించటం, సకాలంలో స్పందించటంతో ప్రాణపాయం తప్పింది.
ఇక బెడ్ పై ఉన్న మహిళను కదిలిస్తే ఆమె చెప్పిన వివరాలు కాస్త జుగుప్పగానే ఉన్నాయి. పాత గుంటూరు మణి హోటల్ ప్రాంతంలో నివసించే ఓ వ్యాపారవేత్త కుమార్తె ఆమె. 12 ఏళ్ల క్రితం శేఖర్ అనే ఓ యువకుడితో పెళ్లయ్యింది. వాళ్లకి ఓ పాప కూడా ఉంది. అయితే రెండేళ్లకే అతన్ని వదిలేసి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. అతనిపై కూడా మోజు తీరాక శ్రీమన్నారాయణ అనే వివాహితుడితో సంబంధం నడిపింది(వివాహం అయ్యిందని సదరు బాధిత మహిళ చెబుతుండటం విశేషం).
అతనితో కాపురం చేస్తూనే స్థానికంగా ఉండే మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. దీంతో శ్రీమన్నారాయణ ఆమెను ఇంట్లోంచి గెంటేశాడు. ఏడాది క్రితం ఆ ఇద్దరు యువకులు కూడా ఆమెను వదిలించుకున్నారు. దీంతో తన పోషణ కోసం డబ్బు ఇవ్వాలంటూ శ్రీమన్నారాయణ పై ఒత్తిడి తెచ్చింది. అందుకు అతను అంగీకరించకపోవడంతో తాము దిగిన ఫోటోలు లీక్ చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్ కు దిగింది.
పాత గుంటూరు పోలీసులను ఆశ్రయించాడంతో, వారు ఆమెను పిలిచి మందలించి పంపేశారు.దీంతో వేదనకు గురైన ఆమె... 'మీ అందరి అంతు చూస్తా'నని ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ మహిళకు ఎలా సాయం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more