తన పత్రిక సాక్షిగా అధికార పక్షం టీడీపీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు అండ్ కోను ఏకేయటంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటాడు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి ఆరోపణలు శృతి మించుతాయనే విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. తాజాగా అలాంటి అతితోనే మరోసారి వార్తల్లో నిలిచింది.
ఏపీలో జూలై 1న బార్ల రెన్యువల్ టెండర్ల ప్రక్రియ కొనసాగబోతుంది. ఈ వ్యవహారంలో కోట్లలో అవినీతి జరిగిందంటూ మందుచూపు పేరిట ఓ కథనంను ప్రచురించింది. అందులో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వందల కోట్లు దండుకున్నాడంటూ రాసింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి దానిపై మండిపడ్డారు. సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా ధరల నిర్థారణ, టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ, బార్ల రెన్యువల్ ప్రక్రియ కోసం 40 లక్షల చొప్పున లంచం తీసుకుని అవకతవకలకు పాల్పడాడంటూ జగన్ మానసపుత్రిక ఆ కథనంలో పేర్కొంది.
మొత్తం 332 కోట్లతో బార్ లు ఐదేళ్లకు రెన్యువల్ ప్రక్రియ, మరో 85 కొత్త వాటికి అనుమతులు ఇవ్వడం అంటూ అందులో ఉంది. దీంతో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే కనుక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఆరోపణలు నిరూపించలేని పక్షంలో జగన్ రాష్ట్రం విడిచి పోవాలని మంత్రి జవహార్ డిమాండ్ చేశాడు. జగన్, సాక్షి పత్రిక ఇరవై నాలుగు గంటల్లోగా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నాడు. లేని పక్షంలో న్యాయపరంగా ఎదుర్కొవాలంటూ సవాల్ విసిరాడు. ఈ మధ్యే జరిగిన కేబినెట్ విస్తరణ ఆయనకు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more