టెలికాం రంగంలో ఒక్కసారిగా జియో తెచ్చిన సంచలన మార్పులు తెలిసిందే. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల జమానాకు అనుగుణంగా డేటా ప్యాకేజీల విషయంలో ఫ్రీ, ఆపై భారీ డిస్కౌంట్ లతో కస్టమర్లు ఎగబడిపోయారు. తర్వాత అన్ని నెట్ వర్క్ లు కూడా ఇలా దిగిరావాల్సి వచ్చింది. అయితే తాజా గణంకాలు మాత్రం జియోకు కాస్త నిరాశ కలిగిస్తున్నాయి.
వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను మొదటి సిమ్గా ఉపయోగిస్తుండగా 82 శాతం మంది రెండో సిమ్గా ఉపయోగిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వెలోసిటీ ఎంఆర్ పేర్కొంది. 86 శాతం మంది ఖాతాదారులు జియోను కొనసాగించడానికి కారణం ఉచిత ఆఫరేనని వెలోసిటీ పేర్కొంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సర్వేలో పాల్గొన్న చాలామంది జియో కాల్ రేట్లు, డేటా ప్యాకేజీలు, ఇంటర్నెట్ స్పీడ్ ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో 2 వేల మందిపై వెలోసిటీ సర్వే నిర్వహించింది. ఇక కాల్ డ్రాప్స్ విషయంలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంటే మెరుగైన స్థానంలో జియో నిలిచింది. అవి వరుసగా 56, 57, 57, 59 శాతంతో ఉండగా జియో 54 శాతం కాల్ డ్రాప్స్ నమోదు చేసింది.
జియో దెబ్బకు మిగతా నెట్ వర్క్ లు వెలవెల బోతున్నాయన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయమే. అయితే, విస్తారంగా ఉన్న టెలికాం రంగంలో ఇది దీర్ఘకాలికంగా పోటీ ఇవ్వటం కష్టమైన అంశమే అని వెలోసిటీ ఎంఆర్ ప్రతినిధి జసల్ షా పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more