Woman beats brother-in-law on road, video viral నడివీధిలో బావను పట్టుకు తన్నిన మరదలు..

Woman beats brother in law on road in meerut viral video

woman thrashes brother-in-law, women brother in law Meerut, husband rape case, brother-in-law, father-in-law, video goes viral, woman, brother-in-law, thrashes, meerut, uttar pradesh, viral video, crime

A video goes viral, a woman thrashes her own brother-in-law in public at Civil Road in Meerut. The woman had also filed a rape case against her husband and father-in-law in 2004.

ITEMVIDEOS: బావ మరదళ్ల సరసం వికటించి.. వీధికెక్కింది..

Posted: 06/20/2017 12:42 PM IST
Woman beats brother in law on road in meerut viral video

మేనరికంలో బావా మరదల్ల సరసాలు సహజమే. ఈ క్రమంలోనే ఆ సరసాలు హద్దు మీరకుండా చెక్ పెట్టేలా.. బావ బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు అన్న రివర్స్ గేర్ కూడా ఎప్పట్నించో వుంది. అయితే అదే ఓ ఇంటికి వెళ్లిన అడపడచుకు తన భర్త సోదరుడు కూడా బావ వరుసే అవుతాడు. కానీ అ బంధం మాత్రం పూర్తి భిన్నం. అత్తారింట్లో బావ అంటే సోదరుడు, తండ్రి స్థానంలో నిలిచిన వ్యక్తి. భార్యభర్తల మద్య ఏ చిన్న సమస్య వచ్చినా.. అది ముందుగా చేరేది కూడా వారి చెంతకే. ఆ తరువాతే ఇంటి పెద్ద అత్తామామల దృష్టికి చేరుతుంది.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ బావ పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది. తానేదో తలిస్తే భగవంతుడు మరేదో తలిచాడని.. అన్నట్లు తనపట్ల శృతిమించి వ్యవహరించిన బావకు ఓ మరదలు సరైన బుద్ది చెప్పింది. నలుగురిలోకి ధైర్యంగా ఈడ్చుకొచ్చి చెంపలువాయించి చెడామడా తిట్టిపారేసింది. ఈ వీడియోను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రకరించి.. సోషల్ మీడియాలో పెట్టడంతో.. అది కాస్తా ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఈ విడియోలో యువతికి నెట్ జనులు బాసటగా నిలుస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తనను హెచ్చరించిన ఓ బావను అందరూ చూస్తుండగానే అతడి చొక్కా పట్టి ఈడ్చుకొచ్చి ఓ చోట కూర్చొబెట్టి నలుగురిలో కడిగి పారేసింది. తనకు చేసిన అవమానాన్ని, తనపై దాదాపు లైంగిక దాడికి పాల్పడ్డటూ చేసిన ప్రయత్నాన్ని ఆ మరదలు గాయాలతో సహా అందరికీ చూపించింది. సాక్ష్యాధారాలతో సహా అతడు దొరికిపోవడంతో కుక్కిన పేనులా బెంగచూపులు చూస్తూ నలుగురిలో పరువు నిలువునా పోగొట్టుకున్నాడు.

అయితే ఈ స్టోరీలో మరో కొత్త కోణం కూడా వినిపిస్తుంది. భర్తపై అత్యాచారం కేసు పెట్టిన మరదలు.. అతనికి దూరంగా పుట్టింటికి చేరుకుందని సమాచారం. అంతేకాదు భర్తకు విడాకులు కూడా పంపిచింది. వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చాలని వచ్చిన భర్త సోదరుడు.. వారింటికి వెళ్లగా అమె కావాలనే అతడ్ని అబాసుపాలు చేయడానికి ఇలా చేసిందన్న కథనాలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు ఏమిటో తేల్చాల్సింది పోలీసులు. అయితే పోలీసు కేసు పెట్టారా లేదా అనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  brother-in-law  thrashes  meerut  uttar pradesh  viral video  crime  

Other Articles