Ex-CS stirs controversy by questioning govt's decisions ద్వందనీతిపై చంద్రబాబును నిలదీసిన కృష్ణారావు

Iyr krishna rao stirs controversy by questioning govt s decisions

Chandrababu Naidu, IYR Krishna Rao, Social Media, Former Chief Secretary, Brahmin Corporation Chairman, Lagadapati rajgopal, Andhra Pradesh

Former Chief Secretary and Brahmin Corporation Chairman I Y R Krishna Rao stirred a major controversy by uploading some post in the Facebook, questing and lampooning the government's decisions

ద్వందనీతిపై చంద్రబాబును నిలదీసిన కృష్ణారావు

Posted: 06/20/2017 05:54 PM IST
Iyr krishna rao stirs controversy by questioning govt s decisions

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వందనీతిపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తూర్పారబట్టారు. చంద్రబాబును విపక్షానికి చెందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కవచ్చు.. కానీ అదే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేను వారి ప్రాంతంలోకి వెళ్లిన సందర్భంగా కూడా కలవకూడదా..? కలిస్తే.. కక్షసాధింపు చర్యలకు పాల్పడతారా..? అని ఆయన నిలదీశారు. సీఎస్ గా ప్రదవీ విరమణ చేసిన తరువాత నాను కోరితే మర్యాద పూర్వకంగానే తనకు ఆ సదవిని ఇచ్చారని అయన చెప్పకోచ్చారు.

ఇక బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా తాను తన సామాజిక వర్గానికి చెందిన వారి అభ్యున్నతికి పాటుపటుడున్న క్రమంలో జాతీయ స్థాయ నేతలు కూడా వీధినాయకుల్లా వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణ సంక్షేమాన్ని కాంక్షించే వాణ్ణి కాబట్టి.. లబ్దిదారులలో అర్హులైన వారిని ప్రాతిపదికగా చేసుకుని కార్పోరేషన్ నుంచి ఫలాలను అందిచానని కానీ.. లబ్దిదారుల్లో ఎవరు ఏ పార్టీ అన్ని వర్గీకరణ చేయలేదని చెప్పారు. తనను తొలగించారన్న కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఏకంగా సోమాజిగూడలోని ప్రేస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తాను ఆర్నెళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా తనకు అవకాశం లభించలేదని తెలిపారు. చంద్రబాబు కూడా ఏకపక్షంగా వ్యవహరించి తన వివరణ కోరకుండానే తనను తొలగించారని అవేదన వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేశానని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించిన చిత్రానికి పన్ను మినాయింపు, మరో భారీ బడ్జెట్ చిత్రానికి టిక్కెట్ల ధర పెంచుకునే వెసలుబాటు కల్పించడాన్ని తాను వ్యతిరేకించానని.. ఇప్పటికే అదే మాటకు కట్టుబడ్డానని చెప్పారు.

అయితే తనను తొలగించడానికి జవాబుదారీతనం లేకుండా ప్రవర్తించాననటం... టీడీపీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వలేదని అరోపణలు చేయడం అభాండాలు వేయడం లాంటిదేనన్నారు. జిల్లా సమన్వయ కర్తలు టీడీపీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వట్లేదంటే పార్టీలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు. ఈ పదవిలో కొనసాగుతున్న కాలానికి సంబంధించి తాను వేతనం తీసుకోకుండా పనిచేశానని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం తనకు లేదని.. అంతటి అర్థ, అంగబలం తనవద్ద లేవని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్‌లో పెట్టినవాటిపై వివరణ ఇవ్వలేదనటం సరికాదని.. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడని రవికిరణ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు తాను చాలా బాధపడ్డానని చెప్పారు.

ఐవైఆర్ తొలగింపు.. అనందసూర్య నియామకం

నవ్యాంద్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తరువాత బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పదవిలో కొనసాగుతున్న ఐవైఆర్‌ కృష్ణారావును ప్రభుత్వం తొలగించింది. ఆయన ఫేస్ బుక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారని, పలువురు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను పెట్టగా వాటిని ఆయన తన అకౌంట్ లో షేర్ చేసుకోవడంపై మండిపడిన సర్కార్.. ఆయనను పదవి నుంచి తొలగించింది.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు ఉత్తర్వులు ఈ మేరకు ఐవీఆర్ కృష్ణారావును తొలగిస్తూ జీవో జారీ చేశారు. కాగా, ఆయన స్థానంలో వేమూరి ఆనందసూర్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీడీపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడిగా ఆనందసూర్య ఉన్నారు. ఆనందసూర్య స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పని చేసిన ఆయన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రాహ్మణుల సమస్యలపై పోరాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles