CM Decoy Operation to Save Girl Child

Yogi adityanath new decoy operation

Uttar Pradesh CM Yogi Adityanath, Yogi Adityanath Prenatal Sex Determination Centres, Yogi Adityanath Decoy Operation, Yogi Pregnant Ladies, Pregnant Ladies Sting Operation, UP Sting Operation, Yogi Adityanath Sting Operation

Uttar Pradesh CM Yogi Adityanath Govt offers pregnant women Rs 1 lakh prize to expose prenatal sex determination centers. Pregnant women to lead ‘decoy operation’ in Uttar Pradesh to nab prenatal sex determination centres.

స్టింగ్ ఆపరేషన్ @ 2లక్షలు

Posted: 06/24/2017 12:57 PM IST
Yogi adityanath new decoy operation

డబ్బుల కోసం ఎంత రిస్క్ అయినా చేసేందుకు ముందుకు రావటం సంగతి ఏమోగానీ. ఉత్తర ప్రదేశ్ సర్కార్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. గర్భిణులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కాసుల మోజులో కక్కుర్తికి పాల్పడుతున్న ఆస్పత్రుల పని పట్టేందుకు స్వయంగా 2 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించాడు. ఇందుకు చేయాల్సిందల్లా వారి వ్యవహారన్ని స్టింగ్ ఆపరేషన్ రూపంలో బయటపెట్టడమే...

లింగనిర్ధారణ పరీక్షలు జరిపే ఆసుపత్రులు, లేదా కేంద్రాల సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల భారీ నగదు బహుమతినిస్తామని ప్రకటించారు. జూలై 1 నుంచి అమలు కానున్న ఈ సరికొత్త పథకంలో బహుమతి నజరానా మూడు దఫాలుగా అందించనున్నారు. ముందుగా స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకోగానే లక్ష రూపాయలు ఇవ్వనున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతం కాగానే అందిస్తారు. కేవలం సమాచారం అందిస్తే 60 వేల రూపాయలు అది కూడ సాక్ష్యం చెప్పిన తరువాత ఇస్తారు. గర్భిణీకి తోడుగా సాయంగా వెళ్లిన మరో సాక్షికి 40 వేల రూపాయలు అందిస్తారు. నిందితులకు శిక్ష పడ్డ తర్వాత మిగిలిన సొమ్మును అందిస్తారు.

యూపీలో 2001 లో పురుష, స్ట్రీ నిష్పత్తి 1000: 916 గా ఉండగా, ఇప్పుడు 1000:902 కు పడిపోయింది. ఇది ఖచ్ఛితంగా కంగారు కలిగించే అంశం. అందుకే ఈ ఆదేశాలను ముఖ్యమంత్రి జారీ చేశారు. అన్ని జిల్లాల ఆరోగ్యశాఖాధికారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ద్వివేది లేఖలు కూడా రాశాడు. అయితే ఇందులో రిస్క్ ఉన్నప్పటికీ సాక్షికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా రక్షణ కల్పిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  CM Yogi Adityanath  Save Girl Child  

Other Articles