Stalin Surprise Demand on Jayalalithaa's Death

Jayalalithaa death mystery inquiry continues

Jayalalithaa, Jayalalithaa Death, Tamil Nadu Presidential Elections, Jayalalithaa Death, Stalin Amma Death, Stalin Jayalalithaa Death Mystery

DMK Head Stalin ready for Jayalalithaa's Death Inquiry. Government should dissolve after Presidential Elections.

అమ్మ డెత్ మిస్టరీ.. ఇక వీడదా!

Posted: 06/26/2017 06:55 PM IST
Jayalalithaa death mystery inquiry continues

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతం మొదలైన రాజకీయ స్తబ్థత ఇంకా కొనసాగుతూనే వస్తోంది. అన్నాడీఎంకే పార్టీ గ్రూప్ తగదాలు తారా స్థాయికి చేరగా, వాటిని వాడుకుని లాభపడేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా డీఎంకే మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసింది. పన్నీర్ సెల్వం తర్వాత ప్రతిపక్ష స్టాలిన్ ఆ స్థాయిలో ఆసక్తి చూపుతూ వస్తున్నాడు.

తాము అధికారంలోకి రాగానే జయలలిత మృతిపై విచారణకు ఓ కమిషన్ వేస్తామని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు. వేలూరు లో ఓ మీటింగ్ లో మాట్లాడిన ఆయన జయలలిత మృతి వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామన్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని, బినామీల ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల మద్దతుతో బినామీ ప్రభుత్వం నడుస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

రాష్ట్రపతి ఎన్నికల అనంతరం తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్టాలిన్ జోస్యం చెప్పాడు. ఇక అమ్మ బతికి ఉంటే దళితుడైన కోవింద్ కే తన మద్ధతు ప్రకటించి ఉండేదన్న సెల్వం డీఎంకే రాజకీయ లబ్ధి కోసమే తమ నినాదాన్ని ఎత్తుకుందని ఆరోపిస్తున్నాడు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  DMK  Stalin  OPS  Presidential Elections  

Other Articles