ఉత్తర ప్రదేశ్ లో నేరాలు అదుపు చేయడం మాతో సాధ్యం కాదని సాక్ష్యాత్తు ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి చేతులెత్తేసిన నేపథ్యంలో రోజుకో యువతి తన మానప్రాణాలను కొ్లపోతున్నారు. తాజాగా నేరాల ఖిల్లాగా మారిన ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటానని వచ్చి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడికి యత్నించాడో అగంతకుడు. అందుకు యువతి అడ్డుకోవడంతో ఆమెను సజీవదహనం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బరేలీలోని షాహిగణేశ్ పూర్ ప్రాంతానికి చెందిన హరియమ్ అనే యువకుడు తన పక్కింట్లో నివసించే మైనర్ బాలికపై కన్నేశాడు. గతంలో రెండు మూడు పర్యాయాలు బాలికతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించిన నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు యువకుడి సోదరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో అమె మందలించిందని బాలికపై కక్షను పెంచుకున్నాడు. అయితే అదివారం రోజున ఇంట్లో బాలిక తల్లిదండ్రులు ఎవరూ లేరన్న విషయాన్ని తెలుసుకున్న యువకుడు తన ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటానని బాలిక ఒంటరిగా వున్నా.. ఇంట్లోకి వ్రవేశించాడు.
ఆ సమయంలో 17ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అదే అదనుగా బావించిన యువకుడు అమెపై లైంగికదాడికి యత్నించాడు. హరియమ్ చర్యతో యువతి గట్టిగా కేకలు వేసింది. దీంతో విషయం బయట పడుతుందని భయపడిన హరియమ్.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more