మోసం చేసేందుకు ఇప్పుడున్న జనరేషన్ వాడుకుంటున్న ఏకైక ఫ్లాట్ ఫాం సోషల్ మీడియానే. వధువు కావలెను.. అన్న ఒకే ఒక్క యాడ్ తో వంద మంది అమ్మాయిలను దారుణంగా మోసం చేసిన యువకుడి ఉదంతం బెంగళూర్ లో వెలుగు చూసింది. ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ పెట్టి వారిని నిలువునా దోచుకున్న వ్యక్తిని కటకటాల్లోకి పంపించారు పోలీసులు.
బెంగళూర్ కు చెందిన ఓ యువతి కొన్ని రోజుల క్రితం తనను ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేశాడని బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సాదత్ ఖాన్ ను ఈ నెల 21న అరెస్ట్ చేశారు. అయితే విచారణలో అతను వెల్లడించిన వివరాలతో షాక్ తిన్నారు. ఇప్పటిదాకా ఇలా 100 మందికి పైగానే మోసం చేసినట్లు సాదత్ ఒప్పకున్నాడు. రాహుల్, కార్తీక్, మహమ్మద్ ఖాన్, ప్రీతమ్ కుమార్ తదితర పేర్లతో ప్రొఫైల్స్ సృష్టించి మాట్రీమోనియల్ సైట్లలో గాలం వేసేవాడు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని, కంపెనీ సీఈఓనని, ప్రభుత్వ అధికారినని ఇలా వరుడి కోసం వెతుకుతున్న యువతులను ఆకర్షించడం మొదలు పెట్టాడు. కాంటాక్టులోకి వచ్చిన వారిని నమ్మించి భారీ మొత్తాల్లో డబ్బు రాబట్టేవాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయి వద్ద తీసుకున్న సొమ్ముతో మరో యువతితో కలసి జల్సాలు చేసేవాడు. స్టార్ హోటళ్లకు వారిని తీసుకువెళ్లి, కార్లలో తిప్పి రంగుల ప్రపంచం చూపించేవాడు. ఆపై అవసరం వచ్చిందని మాయమాటలు చెప్పి డబ్బు లాగి మాయమయ్యేవాడు. కొందరిని శారీరకంగా కూడా వాడుకున్నట్లు చెబుతున్నాడు.
సాదత్, హసన్ ప్రాంతంలో ఐఐటీ వరకూ చదివాడు. మద్యానికి బానిస కావటంతో ఇంట్లోంచి గెంటేశారు. యశ్వంత్ పూర్ లో ఓ వెల్డింగ్ షాపులో, ఆపై కంట్రీ క్లబ్ లో టెలీ కాలర్ గా పని చేశాడు. సిస్కో, హాలెక్స్ కంపెనీల్లో టెలీకాలర్ గా పని చేస్తున్న సమయంలో అమ్మాయిలను వేధించటంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. చివరకు ఇలా ఆన్ లైన్ లో మోసానికి వందకు పైగానే యువతులను బురిడీ కొట్టించేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more