Minister Sensational Allegations on Milk Adulteration

Private milk powder contains hazardous chemicals

Milk Adulteration, Tamil Nadu, Tamil Nadu Dairy Minister, Rajenthra Bhalaji, Reliance Nestle Milk Powders, Chemicals Milk Powder, Rajenthra Bhalaji Milk Adulteration, Tamil Nadu Milk Adulteration, Tamil Nadu Milk Private Firmsm Milk Powder Pollute

Tamil Nadu dairy minister K.T. Rajenthra Bhalaji alleges milk adulteration by private firms, says they mix bleaching powder. Ban after Discuss with CM Palani Swami he added.

నెస్ట్లే, రిలయన్స్ పాలు.. మహా డేంజర్

Posted: 06/28/2017 10:58 AM IST
Private milk powder contains hazardous chemicals

కల్తీ పాల వ్యవహారంపై ప్రముఖ కంపెనీలు నెస్ట్లే, రిలయన్స్ పై సంచలన ఆరోపలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్వయంగా వీటిని చేయటం విశేషం. ఈ రెండు కంపెనీలు తమ పాల పౌడర్ ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలను కలుపుతున్నాయన్నది ఆయన చెబుతోంది.

తమిళనాడు వ్యాప్తంగా కల్తీ పాల వ్యవహారం కలకలం రేపటంతో గత కొన్ని రోజులుగా ఆయన స్వయంగా సీన్ లోకి దిగి విచారణ చేపడుతున్నాడు. ఈ క్రమంలో ఆ రెండింటిని టార్గెట్ చేస్తూ ఆయన ఆరోపణలు చేయగా, ఆధారాలతో ముందుకు రావాలని కంపెనీలు మంత్రి వ్యాఖ్యలను ఖండించాయి. దీంతో మంగళవారం ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సాక్ష్యాలతో ఆయన వివరణ ఇచ్చాడు. కాస్టిక్ సోడా మరియు బ్లీచింగ్ పౌడర్ లాంటి ప్రమాద కరమైన పదార్థాలను వీటిలో కలుపుతున్నారని పరీక్షల్లో తేలిందని వివరించాడు. మాధవరంలోని ఆవిన్ లాబోరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించారని చెప్పాడు.

రాష్ట్రవ్యాప్తంగా చాలా వరకు కుటుంబాలు వీటినే వాడుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల జీవితాలపై తీవ్ర ప్రభావం ఇవి చూపుతాయి. ఈ రసాయనాల మూలంగా కిడ్నీ, లివర్, గుండె మరియు డయాబెటిస్ సంబంధింత రోగాలు రావటం ఖాయం. పరీక్షల్లో అనుమానాలను తావులేకుండా శాంపిల్స్ ను మరోసారి పుణే లోని కేంద్రీయ లాబోరేటరీకి పంపాం. అందులో కూడా ఇదే విషయం ధృవీకరించబడిందని మంత్రి బాలాజీ వివరించాడు. సీఎం పళనిస్వామి, సీఎస్ తో చర్చించి వాటిపై బ్యాన్ విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు త్వరలో స్వచ్ఛమైన దేశీయ పాలతో పౌడర్ ను తయారు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Milk Adulteration  Milk Powder  Reliance Nestle  Rajenthra Bhalaji  

Other Articles